కశ్మీర్ పూంఛ్ జిల్లా బాలాకోట్ నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) వెంబడి ఓ ఉగ్రవాద రహస్య స్థావరాన్ని ఛేదించాయి భద్రతా దళాలు. దబ్బీ గ్రామ సమీపంలో ఉన్న ఈ స్థావరం నుంచి 2 పిస్టల్స్(70 రౌండ్ల సామర్థ్యం), 2 గ్రెనేడ్లను స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు.
ఆదివారం అరెస్ట్ చేసిన ముగ్గురు మిలిటెంట్ అసోసియేట్ల నుంచి రాబట్టిన సమాచారం ఆధారంగా ఈ ఆపరేషన్ చేపట్టినట్టు పూంఛ్ సీనియర్ ఎస్పీ రమేశ్ కుమార్ అంగ్రాల్ వెల్లడించారు. అయితే.. ఈ రికవరీ ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నట్టు చెప్పారు.
ఇదీ చదవండి: శ్రీనగర్లో ఎన్కౌంటర్- ముగ్గురు ముష్కరులు హతం