ETV Bharat / bharat

సైన్యానికి సాయంగా సరిహద్దుల్లో గస్తీకి స్వదేశీ డ్రోన్లు - India army latest news

సరిహద్దు ప్రాంతాల్లో కచ్చితమైన నిఘా కోసం.. స్వదేశీ పరిజ్ఞానంతో భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్​డీఓ) రూపొందించిన డ్రోన్లను వినియోగించనుంది సైన్యం.​ ఈ మేరకు భారత సైన్యం కోరిన విధంగా డీఆర్​డీఓ ఈ డ్రోన్లను సమకూర్చినట్లు రక్షణ వర్గాలు తెలిపాయి.

Indian Army gets 'Bharat' drones for accurate surveillance along China border
సరిహద్దుల్లో గస్తీ కాయనున్న భారత్​ డ్రోన్లు!
author img

By

Published : Jul 21, 2020, 10:54 PM IST

చైనాతో ఉద్రిక్తతలు నెలకొన్న వేళ.. సరిహద్దు ప్రాంతాల్లో కచ్చితమైన నిఘా కోసం సైన్యం.. భారత్​లో తయారైన‌ డ్రోన్లను వినియోగించనుంది. స్వదేశీ పరిజ్ఞానంతో భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్​డీఓ) ఈ డ్రోన్లను రూపొందించింది.

పర్వత ప్రాంతాల్లో..

అధిక ఎత్తు ఉన్న ప్రాంతాలు, పర్వతాలతో కూడిన తూర్పు లద్దాఖ్‌లోని వాస్తవాధీన రేఖ వెంబడి ఈ నిఘా డ్రోన్లు గస్తీ కాయనున్నాయి. ఈ మేరకు భారత సైన్యం కోరిన విధంగా డీఆర్​డీఓ ఈ డ్రోన్లను సమకూర్చినట్లు రక్షణ వర్గాలు తెలిపాయి. భారత్‌ డ్రోన్లను చంఢీగడ్‌లోని డీఆర్​డీఓలో రూపొందించారు.

ప్రపంచంలోనే అత్యంత చురుకైన, తేలికైన డ్రోన్లలో.. భారత్‌ డ్రోన్లు కూడా ఒకటని రక్షణ వర్గాలు వెల్లడించాయి. వీటిలో పొందుపరిచిన కృత్రిమ మేధ ద్వారా మిత్రులెవరో, శత్రువులెవరో కనిపెట్టవచ్చని పేర్కొన్నాయి.

ఎలాంటి వాతావరణంలో అయినా..

అత్యంత శీతల వాతావరణం, కఠిన పరిస్థితులను తట్టుకుని ఇవి గస్తీ కాస్తాయని డీఆర్​డీఓ తెలిపింది. దట్టమైన అడవుల్లో నక్కి ఉన్న మనుషులను కూడా గుర్తిస్తాయని... సైనిక ఆపరేషన్లు జరిగే సమయంలో ఎప్పటికప్పుడు రియల్‌ టైమ్‌ వీడియో ట్రాన్స్‌మిషన్‌ను అందిస్తాయని వెల్లడించింది. రాత్రి వేళల్లోనూ పని చేసేలా నైట్‌ విజన్‌ సాంకేతికత ఉందని డీఆర్​డీఓ పేర్కొంది. రాడార్‌కు చిక్కకుండా నిఘా నిర్వహించేలా వీటిని రూపొందించారు.

ఇదీ చూడండి: చతుర్భుజి కూటమి నావికాదళం భారత్​కు బలమేనా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.