భారత్ అమెరికాతో మరో భారీ ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్రపతి, ప్రధానమంత్రులకు సంబంధించిన రెండు బోయింగ్ వీవీఐపీ విమానాల్లో రక్షణ వ్యవస్థను మరింత పెంచేందుకు.. రూ.1200 కోట్ల విలువైన సూట్లను కొనుగోలు చేయనుంది. 'ఎయిర్ఫోర్స్ వన్' పేరుతో రూపొందించే బోయింగ్-777 విమానాలు.. క్షిపణి దాడులను సైతం తట్టుకోగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయని అధికారిక వర్గాలు తెలిపాయి. గతనెలలో అగ్రరాజ్య అధినేత రెండురోజుల భారత పర్యటన సందర్భంగా ఈ ఒప్పందం కుదిరినట్లు సమాచారం.
ఈ విమానాల్లోని స్వీయ రక్షణ వ్యవస్థలో క్షిపణి హెచ్చరిక సెన్సార్లతో పాటు మరిన్ని అధునాతన రక్షణ సదుపాయాలున్నాయి.
సైన్యం, నౌకాదళ ఒప్పందాలు
అమెరికా అధ్యక్షుడు భారత పర్యటన సందర్భంగా.. నావికాదళానికి సంబంధించి 24 ఎంహెచ్-60 రోమియో మల్టీరోల్ హెలికాప్టర్లు, సైన్యం కోసం 6 కొత్త అపాచీ అటాక్ చాపర్లను భారత్కు అందించేందుకు అగ్రరాజ్యం అంగీకరించింది.
ఇదీ చదవండి: 4వ తరగతి పాసైన బామ్మలకు.. నారీశక్తి పురస్కారం