ETV Bharat / bharat

భారత్​ లాక్​డౌన్​: 21 రోజులు అందుబాటులో ఉండేవి ఇవే

author img

By

Published : Mar 24, 2020, 10:55 PM IST

Updated : Mar 24, 2020, 11:53 PM IST

కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రధాని నరేంద్రమోదీ దేశమంతా లాక్​డౌన్​ ప్రకటించిన నేపథ్యంలో అందుకు సంబంధించిన మార్గదర్శకాలను జారీ చేసింది కేంద్ర హోం శాఖ. అత్యవసరాలు మినహా మొత్తం సేవలను నిలిపివేయాలని స్పష్టం చేసింది కేంద్రం. నిబంధనలు ఉల్లంఘించిన వారు ఐపీసీ సెక్షన్ 188 ప్రకారం శిక్షార్హులని పేర్కొంది.

lockdown
లాక్​డౌన్

దేశవ్యాప్తంగా 21 రోజుల పాటు లాక్​డౌన్ ప్రకటించారు ప్రధాని నరేంద్రమోదీ. ఈ నేపథ్యంలో స్పష్టమైన నిబంధనలను కేంద్ర హోంశాఖ విడుదల చేసింది. జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ (ఎన్​డీఎంఏ)కు అధికారాలు కట్టబెడుతూ ఉత్తర్వులతో పాటు ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసింది. అవి ఇలా ఉన్నాయి.

  • రక్షణ, కేంద్ర పారా మిలిటరీ బలగాలు, ట్రెజరీ, ఇంధన, గ్యాస్, విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ, తపాలా సేవలు, జాతీయ సమాచార వ్యవస్థ, ముందస్తు హెచ్చరికల కేంద్రాలు, విపత్తు నిర్వహణ మినహా అన్ని కేంద్ర ప్రభుత్వ, ప్రభుత్వ రంగ, స్వతంత్ర వ్యవస్థలను మూసివేయాలి.
  • రాష్ట్రాల్లో పోలీసు, హోం గార్డ్స్, పౌర రక్షణ, అగ్నిమాపక, అత్యవసర సేవలు, జైళ్లు, జిల్లా పరిపాలన, ట్రెజరీ, విద్యుత్, నీరు, పారిశుద్ధ్యం, మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్యం నిర్వహణ, నీటి సరఫరా మినహా అన్ని సేవలు బంద్.
  • ఆసుపత్రి, అనుబంధ వ్యవస్థల నిర్వహణ, ఔషధ దుకాణాలు, వైద్య పరికరాల దుకాణాలు, ల్యాబ్​లు, అంబులెన్సులు, వైద్య రంగంలో పనిచేసే సిబ్బందికి మినహాయింపు ఉంటుంది.
  • రేషన్ దుకాణాలు, ఆహార పదార్థాలు, పండ్లు, కూరగాయలు, పాలు, మాంసం, చేపల దుకాణాలు తెరిచి ఉంటాయి.
  • అవకాశం ఉన్నంత వరకు స్థానిక పాలన యంత్రాంగం నిత్య అవసరాలను ఇళ్లకే సరఫరా చేసేందుకు చర్యలు చేపట్టాలి.
  • బ్యాంకులు, బీమా కార్యాలయాలు, ఏటీఎంలు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, టెలీ కమ్యూనికేషన్ ఇంటర్నెట్ వ్యవస్థలు, కేబుల్ సేవలు కొనసాగుతాయి.
  • ఆహార పదార్థాలు, ఔషధాలు, వైద్య పరికరాలు ఈ- కామర్స్ ద్వారా సరఫరా చేసే వారికి మినహాయింపు ఇచ్చారు.
  • పెట్రోల్ పంపు, గ్యాస్ కేంద్రాలు యథావిధిగా నడుస్తాయి.
  • క్షేత్ర స్థాయిలో విద్యుత్ రంగ సేవల్లో పనిచేసే వారికి మినహాయింపు ఉంటుంది.
  • కోల్డ్ స్టోరేజ్​లు, గిడ్డంగులు, నిత్యావసరాల తయారీ యూనిట్లు, ప్రయివేటు సెక్యూరిటీ ఏజెన్సీలకు మినహాయింపులు ఇచ్చారు.
  • ఇతర ఉత్పత్తుల సంస్థలు విధిగా రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సిందే.
  • అత్యవసర రవాణా సేవలు మినహా మిగిలిన రవాణా వ్యవస్థలన్నీ నిలిపివేత.
  • అన్ని విద్యా, పరిశోధన, శిక్షణ సంస్థలన్నీ మూసివేయాల్సి ఉంటుంది.
  • అన్ని మత సంబంధిత స్థలాలు మూసివేయాలి. మత పరమైన కార్యక్రమాలకు ఎటువంటి మినహాయింపులు లేవు.
  • అన్ని సామాజిక, రాజకీయ, క్రీడా, వినోద, విద్య, సాంస్కృతిక కార్యక్రమాలు రద్దు.
  • ఫిబ్రవరి 15 తరువాత విదేశాల నుంచి వచ్చిన వారు ఎవరైనా అధికారుల సూచన మేరకు వ్యవహరించాలి. అధికారులు సూచించిన విధంగా ఇంటికి కానీ లేదా నిర్బంధ కేంద్రాలకు పరిమితమవ్వాలి. ఆరోగ్య శాఖ ఎప్పటికప్పుడు చేసే సూచనలను పౌరులు పాటించాలి.
  • సామాజిక దూరం కొనసాగించాలి. అన్ని సంస్థలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం నడుచుకోవాలి. ఉద్యోగులకు కొవిడ్-19 వ్యాధి సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
  • స్థానికంగా ఈ నిబంధనలను అమలు చేసే వారు మినహాయింపులు తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకొని వ్యవహరించాలి.
  • ఈ అర్ధరాత్రి నుంచి నిబంధనలు పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తాయి. 21 రోజుల పాటు నిబంధనలను కచ్చితంగా అమలు చేయాల్సిందే. జిల్లా న్యాయాధికారి కమాండర్​గా వ్యవహరిస్తూ నిబంధనలన్ని సక్రమంగా అమలు అయ్యేలా చూడాలి.
  • ఉల్లంఘనలకు కమాండర్​లే బాధ్యులు అవుతారు.
  • నిబంధనలు ఉల్లంఘించిన వారు ఐపీసీ సెక్షన్ 188 ప్రకారం శిక్షార్హులు.

Last Updated : Mar 24, 2020, 11:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.