స్వదేశీ పరిజ్ఞానంతో భారత్ అభివృద్ధి చేసిన తేలకపాటి యుద్ధవిమానం 'తేజస్' కొత్త అవతారంలో రాబోతోంది. రెట్టించిన శక్తిసామర్థ్యాలతో 'తేజస్ మార్క్- 2' పేరుతో భారత 75వ స్వాతంత్ర్య వేడుకల నాటికి సిద్ధం కాబోతోంది. దీనితో దేశీయ ఆయుధ తయారీ సామర్థ్యం మరింత ఇనుమడించనుంది.
మార్-2 రూపకల్పన
తేజస్ మార్క్-2కు ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఏడీఏ) రూపకల్పన చేసింది. ఈ ప్రాజెక్టుకు 2009లో ఆమోదం లభించింది. దీనిని హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) ఉత్పత్తి చేస్తోంది. వీటి ఉత్పత్తి 2025-26 సంవత్సరంలో ప్రారంభమవుతుంది.
ఎఫ్-16 కన్నా..
ఈ తేజస్ పోరాట విమానం అమెరికాకు చెందిన ఎఫ్-16 కంటే శక్తిమంతమైంది. గగనతలంలో శత్రువుతో తలపడడంలో దీనికి తిరుగులేదు. తేజస్ మొదటి వెర్షన్ అన్ని పరీక్షలు పూర్తిచేసుకుని ఇప్పటికే భారత వైమానిక దళంలో చేరింది.
మార్క్ -2 శక్తి సామర్థ్యాలు
- మిరాజ్, జాగ్వార్ యుద్ధవిమానాల స్థాయి బరువుతో పాటు మరింత శక్తిమంతమైన జీఈ-414 ఇంజిన్ దీని సొంతం.
- సుదూరం నుంచి శత్రువుపైకి అస్త్రాలు ప్రయోగించే సామర్థ్యం.
- అధునాతన ఏఈఎస్ఏ రాడార్
- గగనతలంలోని లక్ష్యాలను ఛేదించేందుకు స్వదేశీ తయారీ 'అస్త్ర' క్షిపణి (దాదాపు 100 కి.మీ పరిధి)
- స్వదేశీ 'యాంటీ రేడియేషన్ క్షిపణి' (100 కి.మీ)
- భూతల లక్ష్యాల ఛేదనకు 'స్మార్ట్ యూంటీ ఎయిర్ ఫీల్డ్ వెపన్' (సా)
- శత్రు యుద్ధవిమానాల గమనాన్ని ముందే గుర్తించడానికి 'ఇన్ఫ్రారెడ్ సెర్చ్ అండ్ ట్రాక్' (ఐఆర్ఎస్టీ) సెన్సర్
- దూసుకొస్తున్న క్షిపణులను గుర్తించి, అప్రమత్తం చేయడానికి 'మిసైల్ అప్రోచ్ వార్నింగ్ సిస్టమ్' (ఎంఏడబ్ల్యూ ఎస్)
- మెరుగైన కాక్పిట్
-
తేజస్ మార్క్-1 తేజస్ మార్క్-2 పొడవు 13.2 మీటర్లు 14.7 మీటర్లు ఎత్తు 4.4 మీటర్లు 4.86 మీటర్లు రెక్కల విస్తీర్ణం 8.2 మీటర్లు 8.5 మీటర్లు ఆయుధాల అరలు 8 11 ఇంజిన్ ఎఫ్ 404 ఎఫ్ 414 గరిష్ఠ శక్తి 84 కేఎన్ 98 కేఎన్ మోసే ఆయుధాల బరువు 3.8 టన్నులు 6.5 టన్నులు గరిష్ఠ వేగం 1.6 మ్యాక్ 1.8 మ్యాక్ గరిష్ఠ బరువు 13,500 కిలోలు 17,500 కిలోలు పరిధి 1750 కిలోమీటర్లు 3500 కిలోమీటర్లు ఇదీ చూడండి:'హిందీ వివాదం'పై అమిత్ షా వివరణ