కొవిడ్-19పై యావత్ ప్రపంచం పోరాడుతోంది. అయితే భారత్ మాత్రం అన్ని దేశాలకు సహాయం చేస్తూ ముందుకు సాగుతోంది. గడిచిన 2 నెలల్లో 120 దేశాలకు పారాసిటమాల్, హైడ్రాక్సీక్లోరోక్విన్ మాత్రలను భారత్ సరఫరా చేసిందని వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. దేశీయ అవసరాలకు సరిపడా మాత్రలు నిల్వ ఉంచుకున్నాకే.. వాటిని సరఫరా చేశామని తెలిపారు. ధనిక, శక్తిమంతమైన దేశాలు మాత్రమే కాక, వెనుకబడిన దేశాలు సైతం ఈ మాత్రలను పొందాలన్న ఉద్దేశంతోనే వీటి ఎగుమతులపై ఆంక్షలు విధించినట్లు ఓ వెబినార్‌లో వెల్లడించారు.
సరఫరా చేసిన దేశాల్లో సుమారు 40కిపైగా దేశాలు గ్రాంట్ రూపంలో వీటిని పొందాయని గోయల్ తెలిపారు. అలాగే ఇటీవల ప్రధాని పిలుపునిచ్చిన స్వావలంబ భారత్ నినాదం గురించి ప్రస్తావిస్తూ.. ప్రపంచ దేశాలతో కలిసి పనిచేస్తూనే వారిపై పూర్తిగా ఆధారపడకుండా దేశీయంగా నాణ్యమైన ఉత్పత్తులను పోటీ ధరలకే విక్రయించడం ఆ నినాదం వెనుక ముఖ్య ఉద్దేశమని వివరించారు. ఇది కొందరికి అర్థం కాదని విపక్షాలనుద్దేశించి ఎద్దేవా చేశారు.
ఇదీ చూడండి: ఆర్థిక ప్రకటనపై మోదీ హర్షం.. కాంగ్రెస్ గరం