ETV Bharat / bharat

ఆ ప్రకటనలు పచ్చి అబద్ధాలు- పాక్​పై భారత్​ ఫైర్​ - భారత్​ పాక్​

పాకిస్థాన్​ వక్రబుద్ధిని భారత్​ మరోమారు తిప్పికొట్టింది. అంతర్జాతీయ శాంతిపై ఇటీవలే జరిగిన ఐరాస భద్రతా మండలి సమావేశంలో తాము కూడా ప్రకటన చేసినట్టు పాక్​ చేసిన వ్యాఖ్యల్లో నిజం లేదని తేల్చిచెప్పింది. సభ్యదేశం కాని పాక్​కు మాట్లాడే హక్కే లేదని స్పష్టం చేసింది.

India slams Pak for falsely claiming it made statement at UN Security Council meet
ఆ ప్రకటనలు పచ్చి అబద్ధాలు- పాక్​పై భారత్​ ఫైర్​
author img

By

Published : Aug 28, 2020, 6:24 AM IST

ఐరాస భద్రతా మండలిలో.. ఉగ్రవాదంపై తాము ప్రకటన చేసినట్టు పాకిస్థాన్ చేసిన వ్యాఖ్యలను భారత్​ ఖండించింది. అవన్నీ అసత్యమని తేల్చిచెప్పింది. భద్రతా మండలిలో పాక్​ అసలు సభ్యదేశమే కాదని గుర్తుచేసింది.​ ఈ నేపథ్యంలో పాక్​ తప్పుడు ప్రకటనలపై ఐరాసకు లేఖ రాసింది.

అంతర్జాతీయ శాంతి, భద్రత అంశాలను చర్చించేందుకు.. ఈ నెల 24న ఐరాస భద్రతా మండలి సమావేశమైంది. ఆన్​లైన్​ ద్వారా జరిగిన ఈ భేటీలో తాము కూడా వ్యాఖ్యానించినట్టు ఐరాసలో పాకిస్థాన్​ శాశ్వత ప్రతినిధి ప్రకటించారు.

తాజాగా.. ఈ ప్రకటనను భారత విదేశాంగ శాఖ​ ప్రతినిధి అనురాగ్​ శ్రీవాస్తవ​ ఖండించారు. పాక్​ ప్రకటనలు అసత్యమని పేర్కొన్నారు. యూఎన్​ఎస్​సీలో సభ్య దేశం కాని పాక్​కు మాట్లాడే హక్కు లేదని గుర్తుచేశారు. ఇదే విషయాన్ని సమావేశంలో పాల్గొన్న ఇండోనేషియా అనధికారికంగా ధ్రువీకరించినట్టు వెల్లడించారు.

కర్తార్​పుర్​ నడవా...

కర్తార్​పుర్​లో మౌలికవసతుల సదుపాయాలను పెంచేందుకు పాక్​వైపు ఓ వంతెనను నిర్మించాల్సి ఉంది. అయితే కరోనా, వర్షాల కారణంగా రవాణా నిలిచిపోయిందని తెలిపిన శ్రీవాస్తవ.. యాత్రికుల సౌకర్యం కోసం పాకిస్థాన్​తో సంప్రదింపులు జరుపుతున్నట్టు వెల్లడించారు.

ఇదీ చూడండి:- 'కుల్​భూషణ్​పై భారత్​ డిమాండ్​ న్యాయపరంగా అసాధ్యం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.