ETV Bharat / bharat

'కశ్మీర్ భారత అంతర్గతం- మీ జోక్యం ఏంటి?' - చైనా పాకిస్థాన్​ మైత్రి

కశ్మీర్​ అంశంపై చైనా, పాక్ చేసిన సంయుక్త ప్రకటనను భారత్​ ఖండించింది. భారత అంతర్గత విషయాలపై ఇతర దేశాల జోక్యం అవసరం లేదని కుండబద్దలు కొట్టింది విదేశాంగ శాఖ. పాక్ ఆక్రమిత కశ్మీర్​లో ఇతర దేశాలు చేపడుతున్న ప్రాజెక్టులు అక్రమమని స్పష్టం చేసింది.

kashmir
కశ్మీర్​
author img

By

Published : Mar 18, 2020, 9:11 AM IST

జమ్ముకశ్మీర్​ విషయంలో జోక్యం చేసుకోవద్దని చైనా, పాకిస్థాన్​కు స్పష్టం చేసింది భారత ప్రభుత్వం. కశ్మీర్ అంశానికి సంబంధించి చైనా, పాక్ చేసిన సంయుక్త ప్రకటన తర్వాత ఈ విధంగా సమాధానమిచ్చింది భారత్​.

చైనా అధ్యక్షుడు షి జిన్​పింగ్​, పాక్ అధ్యక్షుడు అరిఫ్ అల్వి బీజింగ్​లో మంగళవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కశ్మీర్ అంశంపై చర్చ జరిగింది. కశ్మీర్​కు సంబంధించి తాజా పరిణామాలపై చైనాకు పాక్ వివరించింది. దీనిపై స్పందిస్తూ జమ్ముకశ్మీర్ విషయాన్ని సునిశితంగా పరిశీలిస్తున్నట్లు చైనా, పాక్ సంయుక్త ప్రకటనలో పేర్కొన్నాయి.

ఈ ప్రకటనపై భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ స్పందించారు. జమ్ముకశ్మీర్​ కేంద్రపాలిత ప్రాంతం భారత్​లో అంతర్భాగమని మరోసారి పొరుగుదేశాలకు స్పష్టం చేశారు.

"జమ్ముకశ్మీర్​కు సంబంధించి చైనా, పాక్ చేసిన సంయుక్త ప్రకటనను మేం తిరస్కరిస్తున్నాం. చైనాతోపాటు ఇతర దేశాలు భారత సార్వభౌమాధికారాన్ని గౌరవించి ప్రాంతీయ సమగ్రతకు సంబంధించి ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదు. మేం ఇతర దేశాల అంతర్గత విషయాల్లో ఎప్పుడూ జోక్యం చేసుకోలేదు. "

- రవీశ్ కుమార్​, భారత విదేశాంగ శాఖ

అంతేకాకుండా చైనా, పాక్ ఆర్థిక నడవాపైనా రవీశ్​కుమార్ మాట్లాడారు. పాక్ ఆక్రమిత కశ్మీర్​లో ఇతర దేశాలు చేపడుతున్న ప్రాజెక్టులను వ్యతిరేకిస్తున్నట్లు స్పష్టం చేశారు. వాటిని వెంటనే రద్దు చేయాలని సంబంధిత దేశాల దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఇటువంటి అక్రమ కార్యకలాపాలను భారత్​ ఎప్పటికీ అంగీకరించదని తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.