ETV Bharat / bharat

లలిత్​ మోదీ దంపతులకు 'స్విస్​ నోటీసులు' - అక్రమ నగదు చలామణి కేసు

అక్రమ నగదు చలామణి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎల్​ మాజీ కమిషనర్​ లలిత్​ మోదీ, ఆయన భార్య మినాల్​కు స్విస్​ పన్నుల విభాగం ఎఫ్​టీఏ నోటీసులు జారీచేసింది. హవాలా మోసాలకు పాల్పడి దేశం నుంచి పారిపోయిన లలిత్ వివరాలు అందించాలని భారత్ చేసిన విజ్ఞప్తి మేరకు స్విట్జర్లాండ్ ఈ చర్యలు తీసుకుంది.

లలిత్​ మోదీ దంపతులకు 'స్విస్​ నోటీసులు'
author img

By

Published : Oct 2, 2019, 4:41 PM IST

Updated : Oct 2, 2019, 9:44 PM IST

లలిత్​ మోదీ దంపతులకు 'స్విస్​ నోటీసులు'

హవాలా మోసాలకు పాల్పడి విదేశాలకు పారిపోయిన ఐపీఎల్​ మాజీ కమిషనర్​ లలిత్​మోదీ, ఆయన భార్య మినాల్​కు చెందిన బ్యాంకు ఖాతాల వివరాలు అందజేయాలని భారత్​.. స్విట్జర్లాండ్​ను కోరింది. భారత్ విజ్ఞప్తి మేరకు స్విస్​ పన్నుల విభాగం ఎఫ్​టీఏ... లలిత్​మోదీ దంపతులకు తాఖీదులు జారీ చేసింది. భారత్​ విజ్ఞప్తిపై 10 రోజుల్లో సమాధానం చెప్పాలని లలిత్​ మోదీ దంపతులను ఆదేశించింది.

అక్రమ నగదు లావాదేవీల విషయంలో సమాచారం ఇచ్చిపుచ్చుకోవాలని భారత్, స్విట్జర్లాండ్ ఓ ద్వైపాక్షిక ఒప్పందం చేసుకున్నాయి. అందులో భాగంగానే స్విస్ తాజా చర్యలు తీసుకుంది.

లలిత్​మోదీ 2010లో భారత్​ నుంచి తప్పించుకుని లండన్​కు పారిపోయారు. భారత్​ విజ్ఞప్తి మేరకు 2016లోనూ లలిత్​మోదీకి స్విట్జర్లాండ్​ ఇలాంటి నోటీసులే జారీ చేసింది. అయితే లలిత్ ఇచ్చిన సమాచారాన్ని స్విస్​.. భారత్​కు అందజేసిందా లేదా అన్నది నిర్ధరణ కాలేదు.

ఇటీవల కాలంలో అక్రమ నగదు చలామణి ఆరోపణలు ఎదుర్కొంటున్న మరికొందరు భారతీయులకు కూడా ఎఫ్​టీఏ నోటీసులు జారీ చేసింది స్విస్ ప్రభుత్వం.

ఇదీ చూడండి: మేజిక్​ మెసేజ్​... వాట్సాప్​లో మరో అద్భుత ఫీచర్

AP Video Delivery Log - 0900 GMT Horizons
Wednesday, 2 October, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 24 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0220: HZ Japan Hologram Hotel AP Clients Only/No archive use 4232665
Hologram staff welcome visitors at new Tokyo hotel
AP-APTN-0220: HZ UK Banksy AP Clients Only 4232089
Banksy Parliament painting expected to break auction record for artist ++REPLAY++
AP-APTN-1558: HZ UK Ai Weiwei AP Clients Only 4232669
Artist Ai Weiwei on China anniversary, new exhibit
AP-APTN-1519: HZ World Frieze Botticelli AP Clients Only 4232661
Botticelli could fetch 30 million dollars at Frieze sale
AP-APTN-1300: HZ Rwanda Verbal Autopsy AP Clients Only 4232590
ONLY ON AP Verbal autopsies used in push to better track global deaths ++EMBARGOED 1300 GMT++
AP-APTN-1022: HZ UK Esports Degree AP Clients Only 4232593
Ready student one? Universities launch new esports degrees
AP-APTN-0917: HZ US Hollywood Restaurant AP Clients Only 4232445
A century serving the stars - Tinsel Town's oldest restaurant
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Oct 2, 2019, 9:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.