ETV Bharat / bharat

'హెచ్​1-బీ వీసాల గడువు పొడిగించండి'

author img

By

Published : Apr 11, 2020, 12:52 PM IST

కరోనావైరస్ అమెరికాలో ఉగ్రరూపం దాలుస్తున్న నేపథ్యంలో హెచ్​1-బీ వీసా ఉద్యోగుల ఉపాధి భద్రతపై కేంద్రం దృష్టి సారించింది. ప్రస్తుత సంక్షోభ సమయంలో భారతీయుల హెచ్​1-బీ వీసాల గడువు పొడిగించాలని అమెరికాను కోరింది.

extend H1B visas for stranded Indians amid COVID crisis
వీసాల గడువు పెంచండి

ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికిస్తోంది. చైనాలో ప్రారంభమైన ఈ వైరస్ విజృంభణ ఇప్పుడు అమెరికాలో తీవ్రమైంది. ఇలాంటి సందర్భాల్లో హెచ్​1-బీ వీసా ఉన్న భారతీయ ఉద్యోగుల.. ఉపాధి భద్రతపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించింది.

కరోనా సంక్షోభం కారణంగా భారతీయుల హెచ్1-బీ వీసాల గడువును పెంచాలని అమెరికాను కోరింది భారత్​. ఈ మేరకు అమెరికా విదేశాంగ సహాయ కార్యదర్శి స్టీఫెన్​ ఈ.బీగన్​తో భారత విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్​ చర్చించారు.

హెచ్​1-బీ వీసా ఉన్న వారిని తొలగించమని ఏ కంపెనీకి కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయలేదని అమెరికా తెలిపింది. ఒక వేళ ఎవరినైనా తొలగిస్తే ఆ ఉద్యోగులు.. వారి వీసా గడువు పొడిగించుకునేందుకు 60 రోజుల్లో కొత్త ఉద్యోగం వెతుక్కోవాలని స్పష్టం చేసింది.

ఇదీ చూడండి:గృహ హింసపై ఫిర్యాదులపై వాట్సాప్​ నంబర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.