దేశవ్యాప్తంగా కరోనా కేసులు స్థిరంగా పెరుగుతున్నాయి. తాజాగా 23,068 మంది వైరస్ బారినపడ్డారు. బాధితుల సంఖ్య 1కోటీ 1 లక్షా 46 వేల 846కు చేరింది. వైరస్ సోకినవారిలో 336 మంది చనిపోగా.. మృతుల సంఖ్య 1లక్షా 47 వేల 92కు చేరింది.
పెరిగిన రికవరీలు..
గురువారం ఒక్కరోజే సుమారు 24వేల మందికిపైగా వైరస్ను జయించారు. ఫలితంగా కోలుకున్నవారి సంఖ్య 97 లక్షల 17 వేల 834కు పెరిగింది. యాక్టివ్ కేసుల సంఖ్య 2 లక్షల 81 వేలకు తగ్గింది. దేశవ్యాప్త రికవరీ రేటు 95.77 శాతానికి ఎగబాకింది. మరణాల రేటు స్థిరంగా 1.45 శాతంగా నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
ఇవీ చదవండి: