దేశ గౌరవంపై దాడిని ఏమాత్రం ఉపేక్షించేది లేదని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ స్పష్టం చేశారు. భారత్-చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న లద్దాఖ్‌లో పర్యటించారు. త్రిదళాధిపతి బిపిన్ రావత్, సైనిక దళాల ప్రధానాధికారి జనరల్ ఎంఎం నరవణేతో కలిసి సరిహద్దులో పరిస్థితిపై సమీక్షించారు.
![India not a weak country, no power in the world can touch even an inch of its land:Rajnath in Ladakh](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8062860_914_8062860_1594982879127.png)
![India not a weak country, no power in the world can touch even an inch of its land:Rajnath in Ladakh](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8062860_511_8062860_1594982928665.png)
గల్వాన్ లోయలో ప్రాణాలు కోల్పోయిన భారత సైనికులకు రాజ్‌నాథ్ సింగ్ నివాళులు అర్పించారు. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని కొనియాడారు. సరిహద్దు వివాదం పరిష్కారంపై చర్చలు సాగుతున్నాయని తెలిపారు. అయితే అవి ఎంతమేరకు పరిష్కారం చూపిస్తాయనేది ఇప్పుడే చెప్పలేమన్నారు. గల్వాన్‌లో దుందుడుకు చర్యలకు పాల్పడుతున్న చైనాకు రాజ్‌నాథ్ పరోక్షంగా హెచ్చరికలు పంపారు.
"భారత్ బలహీన దేశం కాదు. ప్రపంచంలోని ఏ శక్తి భారత భూభాగంలోని ఒక్క అంగుళాన్ని కూడా తాకలేదు. భారత్ ఎప్పుడూ శాంతినే కోరుకుంటుంది. ప్రపంచానికి భారత్ శాంతి సందేశం ఇచ్చింది. భారత సార్వభౌమత్వంపై దాడి చేస్తే మాత్రం ఉపేక్షించేది లేదు. పరిస్థితి విషమిస్తే దీటుగా జవాబిచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. సైనికుల త్యాగాన్ని వృథాగా పోనివ్వం."
-రాజ్‌నాథ్ సింగ్, రక్షణ మంత్రి
అంతకుముందు లేహ్‌లో సైనిక దళాల పారా గ్లైడింగ్ విన్యాసాలను రాజ్‌నాథ్ వీక్షించారు. సరిహద్దుల్లో సైనికులు వినియోగిస్తున్న అత్యాధునిక ఆయుధాల పనితీరును అధికారులు రక్షణ మంత్రికి వివరించారు. ఆయుధాల పనితీరును పరిశీలించిన రక్షణ మంత్రి మెషీన్ గన్ను ఎక్కుపెట్టారు.
![India not a weak country, no power in the world can touch even an inch of its land:Rajnath in Ladakh](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8062860_720_8062860_1594982615077.png)
![India not a weak country, no power in the world can touch even an inch of its land:Rajnath in Ladakh](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8062860_235_8062860_1594983090102.png)
ఈ సందర్భంగా లేహ్‌లో భారత సైనిక విన్యాసాలు అబ్బురపరిచాయి. సైన్యం సత్తా చాటేలా సాగిన హెలికాఫ్టర్, యుద్ధ ట్యాంకుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి.
![India not a weak country, no power in the world can touch even an inch of its land:Rajnath in Ladakh](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8062860_798_8062860_1594983055551.png)
పాకిస్థాన్ సరిహద్దుకు
సైనికులతో సమావేశమైన రాజ్‌నాథ్ సరిహద్దుల్లో పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారితో బృంద ఫొటో దిగారు. శనివారం మధ్యాహ్నం రాజ్‌నాథ్... పాకిస్థాన్ సరిహద్దుల్లో పరిస్థితిని సమీక్షిస్తారు. అనంతరం తిరిగి దిల్లీ వెళ్లనున్నారు
![India not a weak country, no power in the world can touch even an inch of its land:Rajnath in Ladakh](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8062860_541_8062860_1594982826849.png)