ETV Bharat / bharat

'అంతర్గత విజయాలతోనే అంతర్జాతీయ గుర్తింపు'

అయిదేళ్లకు ముందు భారత్​ అభివృద్ధి చెందుతున్న దేశాలకు నమూనాగా ఉండేదని, మళ్లీ ఆ పరిస్థితి రావాలని అభిప్రాయపడ్డారు కాంగ్రెస్​ సీనియర్​ నేత శశి థరూర్​. అంతర్గత విజయాలతోనే అంతర్జాతీయ గుర్తింపు లభిస్తుందన్నారు. అందుకు ఆర్థికాభివృద్ధి, అంతర్గత సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

tharoor
కాంగ్రెస్​ సీనియర్​ నేత శశి థరూర్
author img

By

Published : Oct 24, 2020, 6:54 AM IST

అంతర్జాతీయంగా భారత్‌ తనదైన ముద్ర వేయాలంటే ముందుగా అంతర్గత వ్యవహారాలను చక్కదిద్దుకోవాల్సి ఉందని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు శశి థరూర్‌ అభిప్రాయపడ్డారు. శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ భారత్‌ నైతిక అధికారంతోనే ఇతర దేశాలను నిర్దేశించే అవకాశం ఉందని చెప్పారు.

"దేశంలో విజయాలు సాధిస్తేనే మనకు విదేశాల్లో గౌరవం ఉంటుంది. అయితే దురదృష్టవశాత్తు గత కొంతకాలంగా దేశంలో చెడు రోజులు నడుస్తున్నాయి. సామాజిక సమభావం దెబ్బతింది. కరోనా అదుపులోకి రావడం లేదు. చైనాతో సరిహద్దు సమస్యలు తలెత్తాయి. నోట్ల రద్దు తరువాత ఆర్థిక రంగం కుదేలయి నిరుద్యోగం పెరిగింది. ఇవేవీ ఇతర దేశాలకు ఆదర్శప్రాయం కావు. వీటన్నింటిని చక్కదిద్దుకొని ప్రతిష్ఠను పెంచుకోవాల్సి ఉంది. "

- శశిథరూర్​, కాంగ్రెస్​ సీనియర్​ నేత

అయిదేళ్లకు ముందు భారత్‌ అభివృద్ధి చెందుతున్న దేశాలకు నమూనాగా ఉండేదని, మళ్లీ ఆ పరిస్థితి రావాలని అభిప్రాయపడ్డారు థరూర్​. నిధులు ఇచ్చే దేశాలకే ఐక్యరాజ్య సమితిలో గౌరవం ఉంటుందా అన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ అలాంటిదేమీ లేదని అన్నారు. 'భారత్‌ కూడా ఐరాస ప్రజాస్వామ్య నిధికి ఉదారంగా విరాళాలు ఇచ్చింది. కొత్త ఆలోచనలు, సలహాలతో ముందుకు వచ్చింది. వలసవాదం, జాతివాదం, జాతి వివక్షకు వ్యతిరేకంగా పోరాడింది. శాంతి దళాలను పంపించింది. చాలా అంశాల్లో నాయకత్వం వహించింది. అయితే నిబంధనలను పాటించే దేశంగా మిగిలిపోయిందే తప్ప, నిబంధనలను రూపొందించే దేశంగా ఎదగలేదు. పెద్ద దేశాలే ఆధిపత్యం వహిస్తున్నాయి. ఈ పరిస్థితి మారాలంటే మనకు నైతిక బలం అవసరం. అందుకు ఆర్థికాభివృద్ధి, అంతర్గత సమస్యలను పరిష్కరించడం ముఖ్యం' అని వివరించారు. మతాలు, భాషల మధ్య సామరస్యం నెలకొనడం, పొరుగు దేశాలతో సఖ్యతతో ఉండడం ద్వారా దేశ నైతిక బలం పెరుగుతుందని అన్నారు. ఆ రోజే వస్తే భారత్‌లేని భద్రతా మండలి ఉండకూడదని ప్రపంచదేశాలే అంటాయని వ్యాఖ్యానించారు.

ఇదీ చూడండి: భారత్​లో ఐరాస పోస్టల్ స్టాంప్​ విడుదల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.