ETV Bharat / bharat

'అది​ భారత్​లో అంతర్భాగం.. వెంటనే ఖాళీ చేయండి'

గిల్గిత్​-బాల్టిస్థాన్​ విషయంలో పాకిస్థాన్​ సుప్రీం కోర్టు ఆదేశాలు ఇవ్వటాన్ని ఖండించింది భారత్. జమ్ముకశ్మీర్​, లద్దాఖ్​, గిల్గిత్​-బాల్టిస్థాన్ ప్రాంతాలు​ ఎప్పటికీ భారత అంతర్భాగమేనని స్పష్టం చేసింది. ఆక్రమించుకున్న భూభాగాలను వెంటనే ఖాళీ చేయాలని సూచించింది.

author img

By

Published : May 4, 2020, 12:40 PM IST

India lodges protest with Pakistan
గిల్గిత్​-బాల్టిస్థాన్​ భారత అంతర్భాగం

గిల్గిత్​-బాల్టిస్థాన్​లో ఎన్నికలు నిర్వహించేందుకు పాకిస్థాన్​ సుప్రీంకోర్టు అనుమతించటాన్ని తీవ్రంగా తప్పుపట్టింది భారత్​. జమ్ముకశ్మీర్​, గిల్గిత్​-బాల్టిస్థాన్​ సహా లద్దాఖ్​ ప్రాంతాలు మొత్తం భారత్​లో అంతర్భాగమని స్పష్టం చేసింది. ఆక్రమించుకున్న ప్రాంతాలను పాక్​ వెంటనే ఖాళీ చేయాలని తీవ్ర హెచ్చరికలు పంపింది.

" పాకిస్థాన్​ సీనియర్​ దౌత్యవేత్తను భారత్​ పిలిపించి.. గిల్గిత్​-బాల్టిస్థాన్​పై ఆ దేశ సుప్రీం కోర్టు ఆదేశాలు ఇవ్వటంపై నిరసన వ్యక్తం చేశాం. కేంద్ర పాలిత ప్రాంతాలైన జమ్ముకశ్మీర్​, గిల్గిత్​-బాల్టిస్థాన్​ సహా లద్దాఖ్​ ప్రాంతాలు భారత్​లోని అంతర్భాగమేనని స్పష్టంగా తెలియజేశాం. చట్టవిరుద్ధంగా, బలవంతంగా ఆక్రమించుకున్న భూభాగాలపై పాక్​ ప్రభుత్వానికి, అక్కడి న్యాయవ్యవస్థకు ఎటువంటి అధికారం లేదు. జమ్ముకశ్మీర్​లోని ఆక్రమిత ప్రాంతాల్లో భౌతిక మార్పులు చేయాలనుకునే ప్రయత్నాలను భారత్​ తిప్పికొడుతుంది. ఆక్రమించిన ప్రాంతాలను పాక్​ వెంటనే ఖాళీ చేయాలి.

– భారత విదేశాంగ శాఖ

జమ్ముకశ్మీర్​లోని భూభాగాల్లో ఆక్రమణ, మానవ హక్కుల ఉల్లంఘన, దోపిడీలు వంటి దుశ్చర్యల్ని పాకిస్థాన్​ దాచలేదని స్పష్టం చేసింది భారత్​.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.