ETV Bharat / bharat

భారత భూభాగంలోకి వచ్చిన చైనా జవాన్‌ అప్పగింత - indo china war

భారత భూభాగంలోకి వచ్చిన చైనా జవాన్‌ను ఆ దేశానికి మన సైన్యం అప్పగించింది. జనవరి 8న సరిహద్దులు దాటి భారత్​లోకి చైనా సైనికుడు ప్రవేశించాడు.

India hands back PLA soldier to China
భారత భూభాగంలోకి వచ్చిన చైనా జవాన్‌ అప్పగింత
author img

By

Published : Jan 11, 2021, 12:31 PM IST

తూర్పు లద్దాఖ్‌ పాంగాంగ్‌ సరస్సు దక్షిణ ప్రాంతంలో శుక్రవారం భారత సైన్యానికి చిక్కిన చైనా సైనికుడ్ని ఆ దేశానికి అప్పగించారు అధికారులు. చుషుల్‌-మోల్డో వద్ద ఉదయం 10 గంటల 10 నిమిషాలకు చైనా సైనికుడిని అప్పగించినట్లు భారత సైన్యం తెలిపింది. సైనిక నిబంధనల మేరకు చైనా సైనికుడ్ని భారత సైన్యం విచారించింది.

సరిహద్దు దాటి రావాల్సిన పరిస్థితులపై దర్యాప్తు జరిపింది. ఇదే విషయాన్ని చైనా సైన్యానికి కూడా ముందే సమాచారం ఇచ్చారు. చైనా జవాన్‌.. భారత భూభాగంలోకి రావడం గత నాలుగు నెలల్లో ఇది రెండోసారి. గతేడాది అక్టోబరులో తూర్పు లద్దాఖ్‌లో ప్రవేశించిన చైనా సైనికుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించిన భారత బలగాలు మూడు రోజుల దర్యాప్తు తర్వాత వదిలేశాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.