దేశంలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఒక్కరోజే 95,735 కేసులు వెలుగుచూశాయి. మరో 1,172 మంది మరణించారు. ఫలితంగా మొత్తం కొవిడ్ బాధితుల సంఖ్య 44 లక్షల 65 వేల 864కు పెరిగింది.
మరోవైపు రికవరీలు గణనీయంగా పెరుగుతుండటం ఊరట కలిగించే విషయం. మరణాల రేటు కూడా క్రమంగా క్షీణిస్తుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ చెబుతోంది. ఈ క్రమంలో కరోనా వ్యాప్తి కట్టడికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు.
భారీ సంఖ్యలో పరీక్షలు
కొవిడ్ నివారణకు భారీ సంఖ్యలో కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఒక్కరోజే 11,29,756 నమూనాలను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. ఫలితంగా మొత్తం పరీక్షల సంఖ్య 5 కోట్ల 30 లక్షలకు చేరువైంది.
ఇదీ చూడండి: వాయుసేనలోకి అధికారికంగా చేరనున్న రఫేల్