ETV Bharat / bharat

పురోగతి లేని భారత్​-చైనా అధికారుల చర్చలు - పాంగాంగ్​ ఘటనపై భారత్​ చైనా అధికారుల చర్చలు

పాంగాంగ్​ లోయలో చైనా కవ్వింపుల తర్వాత బుధవారం మరోసారి ఇరు దేశాల బ్రిగేడియర్​ కమాండర్​ స్థాయి అధికారులు సమావేశమయ్యారు. ఒకవైపు చర్చలు జరుగుతున్నప్పటికీ ఇరుదేశాల సైనికులు ఆయుధాలను, యుద్ధ ట్యాంకర్లను పోటాపోటీగా మోహరిస్తున్నారు.

India-China border tension: Brigade commander level talks today
పాంగాంగ్​ ఘటనపై మరోసారి భారత్​-చైనా అధికారుల చర్చలు
author img

By

Published : Sep 2, 2020, 4:14 PM IST

తూర్పు లద్దాఖ్​ పాంగాంగ్​ లోయ వద్ద నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్​- చైనా బ్రిగేడియర్​​ కమాండర్​ స్థాయి అధికారులు బుధవారం మరోసారి సమావేశమయ్యారు. గత రెండు రోజుల నుంచి ఈ ఘటనపై సమావేశాలు జరుగుతున్నాయి. దాదాపు ఆరు గంటలపాటు సాగిన ఈ చర్చల్లో ఎటువంటి పురోగతి లేదని భారత్​ అధికారులు తెలిపారు. లద్దాఖ్​లోని ముఖ్యమైన పర్వత ప్రాంతాలను, ప్రదేశాలపై భారత్​ పట్టు సాధించిందని వెల్లడించారు. దీని వల్ల చైనా కదలికలను ఎప్పటికప్పుడు పసిగట్టడానికి వీలు కలిగిందన్నారు.

లద్దాఖ్​ 310 కిలోమీటర్ల దూరంలో హోస్టన్​ ప్రాంతంలో చైనా జె-20 యుద్ధ జెట్లు, ఇతర ముఖ్యమైన యుద్ధ పరికరాలను మోహరించిటనట్లు తెలుస్తోంది. వైమానిక చర్యలను వేగవంతం చేసిన తరుణంలో ఆ ప్రాంతాల్లో నిఘాను పెంచాలని భారత వైమానిక దళం ఇప్పటికే సైన్యానికి సూచించింది.

చైనా సైనికులు మరొక సారి ఎటువంటి చర్యకు పాల్పడినా.. వారిని ఎదుర్కొనేందుకు పాంగాంగ్​ లోయ వద్ద అదనపు సైన్యాన్ని ఇప్పటికే మోహరించింది. బలగాలతో పాటు యుద్ధ ట్యాంకర్లను, క్షిపణులను, సాయుధ శకటాలను తరలించింది. భారత వైమానికి దళం కూడా తన అన్ని ఫ్రంట్‌లైన్ ఫైటర్ జెట్‌లను సుఖోయ్ 30, జాగ్వార్, మిరాజ్ 2000 విమానాలను తూర్పు లద్దాఖ్‌లోని కీలక సరిహద్దు వైమానిక స్థావరాలకు తరలించింది..

ఇదీ చూడండి:'కర్మయోగి మిషన్'​కు కేంద్ర కేబినెట్ ఆమోదం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.