ETV Bharat / bharat

పంచతంత్రంతో శాంతి మంత్రం! ఐదు సూత్రాలివే.. - భారత్ చైనా అయిదు సూత్రాల ప్రణాళిక

తూర్పు లద్దాఖ్ వాస్తవాధీన రేఖ వద్ద ఏర్పడ్డ ఉద్రిక్తతలు తగ్గించుకునేందుకు భారత్, చైనాలు ఐదు సూత్రాలపై ఏకాభిప్రాయానికి వచ్చాయి. బలగాలను వేగంగా వెనక్కి తీసుకునేందుకు నిర్ణయించుకున్నాయి. సరిహద్దు ఒప్పందాలకు కట్టుబడాలని విదేశాంగ మంత్రుల భేటీలో అవగాహనకు వచ్చాయి.

India, China Agree On 5-Point Plan For Resolving Border Standoff In Ladakh
పంచతంత్రంతో శాంతి మంత్రం!
author img

By

Published : Sep 12, 2020, 6:40 AM IST

తూర్పు లద్దాఖ్‌లో నాలుగు నెలలుగా సాగుతున్న సైనిక ప్రతిష్టంభనను పరిష్కరించుకోవడానికి భారత్‌, చైనాలు ఐదు సూత్రాలపై ఏకాభిప్రాయానికి వచ్చాయి. సరిహద్దుల్లో భారీగా మోహరించిన బలగాలను వేగంగా వెనక్కి తీసుకోవాలని, ఉద్రిక్తతలను పెంచే చర్యలకు దూరంగా ఉండాలని, వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వెంబడి ప్రశాంతతను నెలకొల్పాలని నిర్ణయించాయి. సరిహద్దుల్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులతో ఏ దేశానికీ ప్రయోజనం ఉండబోదన్న అభిప్రాయానికి ఇరు పక్షాలు వచ్చాయి. తాజా ఒప్పందంలోని కొన్ని అంశాలను అమలు చేసే అంశంపై వచ్చే నెల మొదట్లో రెండు దేశాల మధ్య కోర్‌ కమాండర్ల స్థాయి చర్చలు జరిగే అవకాశం ఉంది. షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) సమావేశం అనంతరం గురువారం మాస్కోలో భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్‌.జయ్‌శంకర్‌, చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యీ మధ్య చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. ఇవి నిర్మాణాత్మకంగా, నిర్మొహమాటంగా జరిగాయని అధికార వర్గాలు శుక్రవారం వివరించాయి. అందులో పంచ సూత్ర ప్రణాళికపై ఇరు దేశాలూ అంగీకారానికి వచ్చాయని తెలిపాయి. సరిహద్దు వివాదాన్ని పరిష్కరించే విషయంలో ఇరు దేశాలకు ఇవి మార్గదర్శకంగా ఉంటాయని పేర్కొన్నాయి.

డ్రాగన్‌ తీరుపై భారత్‌ అభ్యంతరం

తాజా ఒప్పందంలో సరిహద్దుల్లో బలగాల ఉపసంహరణ, శాంతి పునరుద్ధరణకు ఎలాంటి కాలావధిని నిర్దేశించలేదు. సంబంధిత వర్గాల కథనం ప్రకారం.. గురువారం నాటి చర్చల్లో ఎల్‌ఏసీ వెంబడి చైనా భారీగా బలగాలు, ఆయుధాలను మోహరించడంపై భారత బృందం అభ్యంతరం వ్యక్తంచేసింది. ఇది 1993, 1996 నాటి ద్వైపాక్షిక ఒప్పందాలను ఉల్లంఘించడమేనని పేర్కొంది. చైనా సైన్యం ప్రదర్శిస్తున్న కవ్వింపు ధోరణిని కూడా ప్రస్తావించింది. దీనిపై ఆ దేశ ప్రతినిధి బృందం నుంచి సంతృప్తికర వివరణ రాలేదు. సరిహద్దుల్లో యథాతథ స్థితిని ఏకపక్షంగా మార్చేందుకు ఎలాంటి ప్రయత్నం చేయకూడదని తేల్చి చెప్పింది. ఈ ఒప్పందాలన్నింటికీ భారత బలగాలు తుచ తప్పకుండా కట్టుబడ్డాయని పేర్కొంది. రెండు దేశాల మధ్య విభేదాలు ఉండటం సహజమేనని, అయితే వాటి విషయంలో ఇరు దేశాల అగ్రనాయకుల మధ్య కుదిరిన అవగాహన మేరకు నడుచుకోవడం ముఖ్యమని గురువారం నాటి చర్చల్లో వాంగ్‌ పేర్కొన్నట్లు చైనా విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

చైనా తీరు అనుమానాస్పదమే: పళ్లంరాజు

మాస్కోలో జరిగిన చర్చల్లో చైనా ఇచ్చిన హామీలపై కాంగ్రెస్‌ నేత, రక్షణ శాఖ మాజీ మంత్రి పళ్లంరాజు అనుమానాలు వ్యక్తంచేశారు. ఉద్రిక్తతలను తగ్గించడానికి ఉద్దేశించిన ఒప్పందాలను చైనా ఎన్నడూ గౌరవించలేదని విమర్శించారు. ఇంత సుదీర్ఘ సైనిక ప్రతిష్టంభన రెండు దేశాలకూ మంచిది కాదని ‘ఈటీవీ భారత్‌’తో పేర్కొన్నారు.

అంగీకరించిన పంచ సూత్రాలివీ..

  1. భారత్‌, చైనాల మధ్య ఉన్న విభేదాలు వివాదాలుగా మారకుండా చూడటం సహా ద్వైపాక్షిక సంబంధాల వృద్ధిపై ఇరు దేశాల అగ్రనాయకత్వం మధ్య కుదిరిన ఏకాభిప్రాయాల నుంచి స్ఫూర్తి పొందాలి.
  2. ప్రస్తుత పరిస్థితి ఏ దేశానికీ ప్రయోజనకారి కాదు. ఇరు దేశాల బలగాలు చర్చలను కొనసాగించాలి. వేగంగా సైనిక ఉపసంహరణ జరగాలి. ఇరు దేశాల బలగాల మధ్య నిర్దేశిత దూరం ఉండాలి.
  3. సరిహద్దు ఒప్పందాలు, మార్గదర్శకాలకు ఇరు పక్షాలూ కట్టుబడాలి. శాంతిని పరిరక్షించాలి. ఉద్రిక్తతలను పెంచే ఎలాంటి చర్యలకూ దిగరాదు.
  4. సరిహద్దు అంశంపై ప్రత్యేక ప్రతినిధితో కూడిన యంత్రాంగం ద్వారా చర్చలు కొనసాగించాలి. భారత్‌-చైనా సరిహద్దు వ్యవహారాలపై ఏర్పడ్డ సంప్రదింపులు, సమన్వయ కార్యాచరణ యంత్రాంగం (డబ్ల్యూఎంసీసీ) సమావేశాలను కొనసాగించాలి.
  5. ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టేకొద్దీ రెండు పక్షాలూ వేగంగా కసరత్తు సాగించి, కొత్తగా విశ్వాసం పాదుగొల్పే చర్యలను ఖరారు చేయాలి.

స్వాగతించిన రష్యా

తూర్పు లద్దాఖ్‌లో ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని భారత్‌, చైనాలు తీసుకున్న నిర్ణయాన్ని రష్యా స్వాగతించింది. ఇరు దేశాల విదేశాంగ మంత్రుల మధ్య సమావేశానికి తాము వేదికను కల్పించడం సంతోషంగా ఉందని పేర్కొంది. చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యీతో కలిసి రష్యా విదేశీ వ్యవహారాల మంత్రి సెర్గెయ్‌ లావ్రోవ్‌ శుక్రవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. గురువారం జరిగిన రష్యా, భారత్‌, చైనా (ఆర్‌ఐసీ) చర్చలు ఫలప్రదంగా సాగాయన్నారు

దిల్లీలో అత్యున్నత స్థాయి భేటీ

భారత్‌, చైనా మధ్య కుదిరిన ఐదు సూత్రాల ఒప్పందంపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ శుక్రవారం దిల్లీలో అత్యున్నత స్థాయి భేటీ నిర్వహించారు. ఇందులో జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోభాల్‌, త్రిదళాధిపతి జనరల్‌ బిపిన్‌ రావత్‌, త్రివిధ దళాధిపతులు పాల్గొన్నారు. తూర్పు లద్దాఖ్‌లోని పాంగాంగ్‌ సరస్సు దక్షిణ తీరం వద్ద భారత్‌, చైనాల మధ్య తాజా ఘర్షణ నేపథ్యంలో అక్కడి భద్రతా పరిస్థితులపై కూడా ఈ భేటీలో సమీక్ష జరిగింది. ఎలాంటి పరిస్థితి తలెత్తినా తిప్పికొట్టేలా భారత సైన్యం సన్నద్ధంగా ఉందని నరవణె ఈ సందర్భంగా తెలిపినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. శీతాకాలంలోనూ బలగాల మోహరింపును కొనసాగించేందుకు రూపొందించిన ప్రణాళికలను ఆయన వివరించినట్లు తెలిపాయి. రానున్న కొద్దిరోజుల్లో ఎల్‌ఏసీ వెంబడి చైనా సైనిక వైఖరిపై భారత సైన్యం నిశితంగా కన్నేసి ఉంచుతుందని, తద్వారా ఐదు సూత్రాల ఒప్పందానికి అనుగుణంగా ఉద్రిక్తతలను తగ్గించుకునే విషయంలో ఆ దేశ నిబద్ధతపై ఒక అంచనాకు రావడానికి వీలవుతుందని వివరించాయి. మరోవైపు చుషుల్‌లో భారత్‌, చైనాల మధ్య శుక్రవారం కూడా బ్రిగేడ్‌ కమాండర్ల స్థాయిలో సైనిక చర్చలు జరిగాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.