ETV Bharat / bharat

'ఈశాన్య రాష్ట్రాలే దేశానికి అభివృద్ధి ఇంజిన్లు'

దేశ అభివృద్ధికి ఈశాన్య రాష్ట్రాలు కీలకంగా వ్యవహరిస్తున్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. అసోం లేని భారతీయ సంస్కృతి అసంపూర్ణంగా ఉంటుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో సంస్కృతి, కళలను బలోపేతం చేసేందుకు భాజపా కట్టుబడి ఉందన్నారు.

amit shah in assam
'రాష్ట్రంలో సైద్ధాంతిక మార్పు రావాలి'
author img

By

Published : Dec 26, 2020, 3:28 PM IST

Updated : Dec 26, 2020, 7:37 PM IST

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో ఈశాన్య రాష్ట్రాలు దేశానికి అభివృద్ధి ఇంజిన్లుగా మారాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. జాతి అభివృద్ధికి ఈశాన్య రాష్ట్రాలే కేంద్ర బిందువు అని మోదీ భావిస్తున్నారని తెలిపారు. గత ఆరేళ్లలో 30 సార్లు మోదీ ఈ ప్రాంతాలను సందర్శించారని గుర్తు చేశారు. వచ్చిన ప్రతిసారి.. ఇక్కడి రాష్ట్రాలకు కానుకలు తీసుకొచ్చారని చెప్పారు.

అసోంలోని కామరూప్​లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. సీఎం శర్వానంద సోనోవాల్, ఆర్థిక మంత్రి హిమాంత బిశ్వ శర్మ నేతృత్వంలో అసోం శాంతియుత, అభివృద్ధి బాటలో పయనిస్తోందని పేర్కొన్నారు.

"అసోంను ఇదివరకు.. ఆందోళనలు, హింసకు గుర్తుగా చూసేవారు. కానీ, సోనోవాల్, శర్మ.. రాష్ట్ర ప్రజలను ఐక్యం చేశారు. సంప్రదాయాలు, వారసత్వ సంపదను ప్రోత్సహిస్తూ ఈ ప్రాంతాన్ని దేశంతో అనుసంధానించారు. రాష్ట్రంలోని వేర్పాటువాద సంస్థలు లొంగిపోయాయి. జనజీవన స్రవంతిలో కలిసిపోయారు."

-అమిత్ షా, కేంద్ర హోంమంత్రి

రాష్ట్రాల సంస్కృతి బలోపేతమయ్యేంత వరకు దేశం సమున్నతంగా మారదని అన్నారు షా. ఇదే విషయాన్ని భారతీయ జనతా పార్టీ విశ్వసిస్తుందని పేర్కొన్నారు. అసోం సంస్కృతి, కళలు లేని భారతీయ సంస్కృతి అసంపూర్ణమని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్​పై విమర్శలు చేశారు.

"ఆచార్య శంకర్​దేవ్ జన్మస్థలానికి కాంగ్రెస్ చేసిందేమీ లేదు. అసోం చరిత్ర, నాటక రచన, కళలు, కవిత్వానికి శంకర్​దేవ్ గుర్తింపు తీసుకొచ్చారు. రాష్ట్ర సంస్కృతి, కళలు, భాషను బలోపేతం చేసేందుకు భాజపా మాత్రం కట్టుబడి ఉంది."

-అమిత్ షా, కేంద్ర హోంమంత్రి

అసోంలో ఒకప్పుడు అనేక ఉద్యమాలు జరిగేవని, ఆయా ఆందోళనలో వందలాది మంది యువత చనిపోయారని అన్నారు షా. ఈ సమస్యలకు అభివృద్ధి ఒక్కటే పరిష్కారమని పేర్కొన్నారు. ప్రస్తుతం అభివృద్ధి జరుగుతున్నప్పటికీ.. సైద్ధాంతిక మార్పులు రావాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.

ప్రాజెక్టులకు శంకుస్థాపన

ఈ సందర్భంగా రాష్ట్రంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు అమిత్ షా. రూ. 755 కోట్లతో మెడికల్ కాలేజీతో పాటు తొమ్మిది న్యాయ సంస్థల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. వీటితో పాటు మరో రెండు ప్రాజెక్టులను ఆవిష్కరించారు. వైష్ణవ సంస్కర్త శంకర్​దేవ్ జన్మించిన 'బతాద్రవా థాన్' సుందరీకరణ పనులతో పాటు 50 ఏళ్లపైబడిన వైష్ణవ ప్రార్థన, కమ్యునిటీ హాళ్లకు రూ.2.5 లక్షల చొప్పున అందించే 'అసోం దర్శన్​' పథకం మూడో విడతను ప్రారంభించారు.

ఇదీ చదవండి: 'డీడీసీ ఎన్నికలు కొత్త అధ్యయాన్ని లిఖించాయి'

Last Updated : Dec 26, 2020, 7:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.