ETV Bharat / bharat

సైనిక రవాణా కోసం లద్దాఖ్​లో కొత్త రహదారి! - మనాలీ నుంచి లేహ్

శత్రువుల కళ్లు గప్పి బలగాలు, సైనిక సామాగ్రిని సరిహద్దుకు తరలించేందుకు ఉపయోగపడే నూతన రోడ్డు మార్గాన్ని భారత్ నిర్మిస్తోంది. ఈ నిర్మాణం ద్వారా మనాలీ- లేహ్ మధ్య ప్రయాణంలో మూడు గంటల సమయం ఆదా అవుతుంది. ఇతర ప్రాంతాలతో లద్దాఖ్​ను అనుసంధానించే మూడో మార్గంగా ఇది రూపుదిద్దుకుంటోంది.

India building new road to Ladakh
లేహ్ నుంచి మనాలీకి కొత్త రోడ్డు మార్గం
author img

By

Published : Aug 20, 2020, 5:24 AM IST

శత్రు కంటపడకుండా సరిహద్దుకు సైన్యం, యుద్ధ ట్యాంకులను తరలించే విధంగా లేహ్ నుంచి మనాలీకి కొత్త రోడ్డు మార్గాన్ని నిర్మించేందుకు భారత్​ ప్రయత్నిస్తోంది. భారత్​లోని ఇతర ప్రాంతాలతో లద్దాఖ్​ను అనుసంధానించే మూడో రహదారి మార్గంగా ఇది రూపుదిద్దుకుంటోంది.

వ్యూహాత్మకంగా కీలకమైన దౌలత్ బేగ్​ ఓల్డీ సహా ఇతర ప్రాంతాలకు ప్రత్యామ్నాయ మార్గాలు నిర్మించేందుకు ప్రభుత్వం గత మూడేళ్ల నుంచి చర్యలు చేపడుతోంది. మోటారు వాహనాలు ప్రయాణించగలిగే ప్రపంచంలోని అతి ఎత్తైన మార్గమైన 'ఖర్దుంగ్​లా కనుమ'​ నుంచి ఈ పనులు ప్రారంభించింది.

"మనాలీ నుండి లేహ్ వరకు నిమూ-పదాం-దార్చా ద్వారా ప్రత్యామ్నాయ కనెక్టివిటీని అందించడానికి ఏజెన్సీలు కృషి చేస్తున్నాయి. ప్రస్తుతం శ్రీనగర్ నుంచి జోజిలా గుండా వెళ్తున్న మార్గాలతో పోలిస్తే ఇది చాలా సమయాన్ని ఆదా చేయడంలో సహాయపడుతుంది."

-ప్రభుత్వ వర్గాలు

ఈ రహదారి నిర్మాణం పూర్తయితే మనాలీ-లేహ్​ ప్రయాణంలో మూడు గంటల సమయం ఆదా అవుతుందని అధికారులు తెలిపారు. పాకిస్థాన్​, చైనా వంటి శత్రుమూకలకు భారత సైన్యం కదలికలను పసిగట్టే అవకాశమే ఉండదని స్పష్టం చేశారు. ఇతర ప్రాంతాల నుంచి లద్దాఖ్​కు బలగాలు, ట్యాంకులు, భారీ ఆయుధ సామగ్రిని ఎవరి కంట పడకుండా తీసుకురావచ్చని వెల్లడించారు.

ప్రస్తుతం జోజిలా గుండా వెళ్తున్న రహదారిని ప్రధానంగా సరకు రవాణా, బలగాల తరలింపు కోసం ఉపయోగిస్తున్నారు. ఈ మార్గం ద్రాస్-కార్గిల్ మీదుగా లేహ్​ వరకు ఉంది. 1999 కార్గిల్ యుద్ధంలో పాకిస్థాన్ సైన్యం ఇదే మార్గాన్ని లక్ష్యంగా చేసుకుంది. ఎత్తైన ప్రాంతాల్లో ఉండి.. ఈ మార్గంపై తరచుగా బాంబులు, మోర్టార్ షెల్లింగులను ప్రయోగించింది.

పనులు ప్రారంభం

ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. చైనాతో సరిహద్దు ఘర్షణ సందర్భంగా ప్రధాని పర్యటించిన నిమూ వరకు ఈ మార్గం ఉంటుందని వెల్లడించాయి. వ్యూహాత్మక దర్బుక్ షియోక్-దౌలత్ బేగ్​ ఓల్డీ రోడ్​కు ప్రత్యామ్నాయం కల్పించే విధంగా పాత వేసవి మార్గాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు స్పష్టం చేశాయి. లేహ్​ నుంచి ఖర్దుంగ్లా వరకు.. అక్కడి నుంచి ససోమా-సాసెర్, లాష్యోక్, దౌలత్ బేగ్ ఓల్డీ హిమానీనదాల గుండా నూతన రహదారి ఉంటుందని తెలిపాయి.

డీఎస్​డీబీఓ రహదారికి ప్రత్యామ్నాయం అన్వేషించే బాధ్యతలను 14వ కార్ప్స్​కు అప్పగించినట్లు సీనియర్ అధికారులు తెలిపారు. ట్రయల్స్​లో భాగంగా ఓ బృందాన్ని ఆ ప్రాంతానికి పంపినట్లు వెల్లడించారు. ససోమా నుంచి సాసెర్​లా వరకు ఈ బృందం వాహనాల్లో.. అక్కడి నుంచి కాలినడకన ప్రయాణించిందని చెప్పారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.