కర్ణాటకకు చెందిన ఓ ఉపాధ్యాయుడు కాళ్లకు చైను కట్టుకుని పద్మాసనంతో సముద్రంలో ఈత కొట్టాడు. 25నిమిషాల 16 సెకన్లలో ఒక కిలోమీటరు దూరాన్ని ఛాతితో ఈది అందరినీ అబ్బుర పరిచారు. ప్రఖ్యాత ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించేందుకు ఆయన ఈ సాహసం చేశారు.
మూడోతరగతి నుంచే..
కర్ణాటక ఉడిపి జిల్లా కుందాపుర్ మండలం కంచుగొడి గ్రామానికి చెందిన నాగరాజ కర్వీ బంట్వాల్ మండలం కల్మంజాలోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఆయన మూడో తరగతిలో ఉన్నప్పటినుంచే ఈత కొట్టడం ప్రారంభించారు. ఇప్పటివరకు ఎన్నో జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని పతకాలు సాధించారు.
గత జనవరిలో గుజరాత్, వడోదరాలో జరిగిన జాతీయస్థాయి ఈత పోటీల్లో రెండు బంగారు పతకాలు, ఒక వెండి పతకం సాధించారు. ఇప్పటికే ఆయన వేల మంది విద్యార్థులకు ఈత నేర్పించారు.
ఇదీ చదవండి : బంగాల్‌కు అమిత్ షా- చేరికలే లక్ష్యమా?