ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ అప్పటి యూపీఏ ప్రభుత్వాన్ని అధికారం నుంచి దించేందుకు ఆర్ఎస్ఎస్-భాజపా కుట్ర చేశాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. 2011లో ఉవ్వెత్తున ఎగసిపడిన అవినీతి వ్యతిరేక ఉద్యమం, ఆమ్ఆద్మీ పార్టీ వెనుక భాజపా హస్తముందని విమర్శించారు.
కాంగ్రెస్‌ను అధికారం నుంచి తప్పించి గద్దెనెక్కడానికి అవినీతి వ్యతిరేక ఉద్యమానికి భాజపా-ఆర్ఎస్ఎస్ పెద్ద ఎత్తున మద్దతిచ్చాయని ఆమ్ఆద్మీ పార్టీ వ్యవస్థాపక సభ్యుడు, ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా రాహుల్ ప్రస్తావించారు.
ఈ కుట్రల గురించి అందరికీ తెలిసిన విషయాన్ని ఆప్ వ్యవస్థాపక సభ్యుడు ధ్రువీకరించారని రాహుల్ ట్వీట్ చేశారు.
సోనియా గాంధీ వైద్య పరీక్షల కోసం రాహుల్ ఆమెకు తోడుగా అమెరికా వెళ్లారు.
-
What was known to us has been confirmed by a founding AAP member.
— Rahul Gandhi (@RahulGandhi) September 15, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
The IAC movement & AAP were propped up by the RSS/BJP to subvert democracy and bring down the UPA government.https://t.co/QDYyOOTtw7
">What was known to us has been confirmed by a founding AAP member.
— Rahul Gandhi (@RahulGandhi) September 15, 2020
The IAC movement & AAP were propped up by the RSS/BJP to subvert democracy and bring down the UPA government.https://t.co/QDYyOOTtw7What was known to us has been confirmed by a founding AAP member.
— Rahul Gandhi (@RahulGandhi) September 15, 2020
The IAC movement & AAP were propped up by the RSS/BJP to subvert democracy and bring down the UPA government.https://t.co/QDYyOOTtw7
ఆప్ మండిపాటు
రాహుల్ వ్యాఖ్యల్ని తప్పుబట్టారు ఆమ్ ఆద్మీ పార్టీ నేత సంజయ్ సింగ్. కాంగ్రెస్ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఇలాంటి కుంటి సాకులు చెబుతున్నారని ధ్వజమెత్తారు. ప్రస్తుతం దేశ ప్రజలకు భాజపా, కాంగ్రెస్‌పై నమ్మకం లేదని... భవిష్యత్‌లో వారు ఆప్నే ఎంచుకుంటారని వ్యాఖ్యానించారు.
2014 ఎన్నికలకు ముందు...
అవినీతి వ్యతిరేక ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నవారిలో ప్రశాంత్ భూషణ్ ఒకరు. ఆమ్ఆద్మీ పార్టీ స్థాపనకు ఈ ఉద్యమం ప్రధాన కారణం. అయితే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలతో భూషణ్, యోగేంద్ర యాదవ్‌ను ఆమ్ఆద్మీ పార్టీ నుంచి బహిష్కరించింది.
జన్ లోక్‌పాల్ బిల్లు ప్రవేశపెట్టడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ 2011, 2012లో ఈ అవినీతి వ్యతిరేక ఉద్యమం మొదలైంది.
- ఇదీ చూడండి: ఆ ఐదుగురిని ఎత్తుకెళ్లి 'స్వర్గం' చూపించిన చైనా!