ETV Bharat / bharat

మోదీ కేబినెట్​లో ఎవరెవరు...?

నరేంద్రమోదీ భారత ప్రధానమంత్రిగా రెండో సారి ప్రమాణస్వీకారం చేయనున్నారు. అయితే.. నూతన మంత్రివర్గంలో ఎవరెవరు ఉంటారనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఇదే అంశంపై భాజపా జాతీయాధ్యక్షుడితో .. నరేంద్ర మోదీ రెండో రోజు సుదీర్ఘ చర్చలు జరిపారు.

author img

By

Published : May 30, 2019, 6:54 AM IST

Updated : May 30, 2019, 12:32 PM IST

మోదీ కేబినెట్​లో ఎవరెవరు...?
మోదీ కేబినెట్​లో ఎవరెవరు...?

రాష్ట్రపతి భవన్​ ఎదుట ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై రాత్రి 7 గంటలకు రాష్ట్రపతి కోవింద్​ .. మోదీతో ప్రధానిగా ప్రమాణం చేయించనున్నారు. కొందరు కొత్త మంత్రులూ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

అయితే.. ప్రధాని నరేంద్ర మోదీ కొత్త కేబినెట్​లో ఎవరెవరు ఉంటారనేది ప్రాధాన్యం సంతరించుకుంది. కీలకమైన హోం శాఖ, ఆర్థిక, రక్షణ శాఖ, విదేశీ వ్యవహారాల బాధ్యతలు ఎవరికి అప్పగిస్తారోనని ఆసక్తి నెలకొంది.

మోదీ, భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్​ షాలు కేబినెట్​ కూర్పుపై వరుసగా రెండో రోజు సుదీర్ఘంగా చర్చలు జరిపారు. పలువురు సీనియర్లను కొనసాగించనుండటంతో పాటు.. కొంతమంది కొత్తవారికి అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది.

కేబినెట్​లో అమిత్​ షా...

కేంద్ర ప్రభుత్వంలో అమిత్​ షా భాగం కానున్నారని ఊహాగానాలొస్తున్నాయి. ఈ తరుణంలో అమిత్​ మంత్రివర్గంలో చేరుతారా... లేదా అనేది నేడు తేలనుంది. ఒకవేళ ఆయనను మోదీ మంత్రివర్గంలోకి తీసుకోవాలని భావిస్తే కీలక శాఖ దక్కనుంది.

అయితే.. రానున్న కీలక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిసే వరకు షా.. భాజపా అధ్యక్షుడిగానే ఉండనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల తర్వాతే.. మంత్రివర్గంలోకి తీసుకొనే యోచనలో మోదీ ఉన్నట్లు పార్టీ వర్గాల సమాచారం.

అనారోగ్యంతో బాధపడుతున్న కేంద్ర మంత్రి అరుణ్​జైట్లీ మంత్రివర్గంలో కొనసాగడం కష్టమే. కొత్త కేబినెట్​లో తనకు మంత్రి పదవి వద్దని ఇప్పటికే మోదీకి లేఖ రాశారు జైట్లీ.

ప్రస్తుత కేబినెట్​లోని చాలామంది సీనియర్లు ఈసారీ కొనసాగే అవకాశముంది. రాజ్​నాథ్​ సింగ్​, నితిన్​ గడ్కరీ, నిర్మలా సీతారామన్​, స్మృతి ఇరానీ, రవిశంకర్​ ప్రసాద్​, పీయూష్​ గోయల్​, ధర్మేంద్ర ప్రధాన్​, నరేంద్ర సింగ్​ తోమర్​, ప్రకాశ్​ జావడేకర్​లకు మరోసారి మంత్రివర్గంలో స్థానాలు పదిలమే.

ఉత్తరప్రదేశ్​ అమేఠీలో కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీపై గెలిచి చరిత్ర సృష్టించిన స్మృతి ఇరానీకి బహుమతిగా భాజపా నాయకత్వం కీలక మంత్రిత్వశాఖ ఇచ్చే అవకాశం ఉంది.

మిత్రపక్షాలకు...

మిత్రపక్షాలైన శివసేన, జేడీయూ పార్టీల తరఫున గెలిచిన వారికి కేంద్ర మంత్రివర్గంలో స్థానం ఖాయంగా కనిపిస్తోంది. ఈ పార్టీలకు ఒక కేంద్ర మంత్రి, మరో సహాయ మంత్రి పదవి లభించే అవకాశాలున్నాయి. లోక్​జన్​శక్తి పార్టీ, శిరోమణి అకాలీదళ్​​లకు ఒక్కో మంత్రి పదవి దక్కే అవకాశాలున్నట్లు సమాచారం.

తమిళనాడులో మిత్రపక్షమైన అన్నాడీఎంకేకు మంత్రి పదవి ఇచ్చేందుకు భాజపా సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఒకే లోక్​సభ స్థానాన్ని దక్కించుకుంది అధికార పార్టీ అన్నాడీఎంకే.

కొత్తముఖాలు...

బంగాల్​, ఒడిశా, తెలంగాణ రాష్ట్రాల్లో ఈసారి కమలం మెరుగైన ప్రదర్శన చేసింది. ఈ నేపథ్యంలో ఇక్కడ గెలిచిన కమలనాథుల్లో కొంతమందికి నూతన కేబినెట్​లో చోటు కల్పించనున్నారు.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
SAUDI TV - AP CLIENTS ONLY
Jeddah - 29 May 2019
1. Various of Lebanese Prime Minister Saad Hariri arriving on tarmac, greeting officials
2. Various of Hariri entering building
3. Hariri going up escalator, walking down red carpet
4. Various of Hariri walking down red carpet, honour guard
5. Wide of building, soldiers
6. Hariri sitting with Prince Badr bin Sultan bin Abdulaziz, Deputy Governor of Mecca Region
7. Close of Hariri
8. Hariri and the prince standing, walking away
9. Hariri and the prince walking away
10. Building exterior
STORYLINE:
Lebanese Prime Minister Saad Hariri arrived in Jeddah Wednesday for a meeting of the Organisation of Islamic Cooperation, amid tensions in the Middle East.
The visit comes after a letter from Saudi King Salman inviting Qatar to the summit after recent attacks around the Persian Gulf that the US attributes to Iran.
Heightened tensions between the US and Iran have seen American officials increasingly call for Gulf Arab nations to band together.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : May 30, 2019, 12:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.