భారత్‌లో 2019ఏడాదిలో 24.04 లక్షల క్షయ కేసుల్ని గుర్తించారు. క్షయకు సంబంధించిన వివరాలతో కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన వార్షిక నివేదికలో ఈ వివరాలు పొందుపర్చారు. 2019 లో ఈ వ్యాధితో 79 వేల 144 మంది మరణించారని పేర్కొన్నారు. క్రితం ఏడాదితో పోల్చితే... కేసులు సంఖ్య 14 శాతం పెరిగిందని నివేదిక వెల్లడించింది.
సంకల్పానికి కట్టుబడి..
ప్రపంచఆరోగ్య సంస్థ నిర్దేశించిన మేరకు 2025 నాటికి దేశం నుంచి టీబీను తరిమికొట్టాలనే సంకల్పానికి కేంద్రం కట్టుబడి ఉందని మంత్రి హర్షవర్ధన్ అన్నారు. క్షయ కట్టడిలో 50 లక్షల జనాభా విభాగంలో ఉత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రల జాబితాలో గుజరాత్, ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్‌లు ముందు వరసలో ఉండగా... 50 కంటే తక్కువ జనాభా విభాగంలో త్రిపుర, నాగాలాండ్ రాష్ట్రాలున్నాయి. కేంద్ర పాలిత ప్రాంతాల్లో దాద్రా నగర్ హవేలి, దామన్ దీవ్లు ఉత్తమ ప్రతిభ కనబరిచాయి.
50 శాతం ఆ రాష్ట్రాల్లోనే..
నివేదిక ప్రకారం... మొత్తం కేసుల్లో 50 శాతం కేసులు ఐదు రాష్ట్రాల్లోనే వెలుగుచూశాయి. ఉత్తర్‌ప్రదేశ్ 20 %, మహారాష్ట్ర 9 %, మధ్యప్రదేశ్‌లో 8%, రాజస్థాన్, బిహార్ రాష్ట్రాల్లో 7% కేసులు నమోదయ్యాయి. ప్రారంభ దశలోనే రోగ నిర్ధరణ, మెరుగైన చికిత్స అందిస్తే... క్షయను నియంత్రించవచ్చన్నారు మంత్రి. అందుకోసం దేశవ్యాప్తంగా పరీక్షా కేంద్రాలని, రోగ నిర్ధరణ సౌకర్యాల్ని పెంచనున్నట్లు వెల్లడించారు. క్షయ రోగుల విషయంలో ప్రజలు వివక్ష చూపించకూడదని.. వారికి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి: బంగాల్లో జులై 31 వరకు లాక్డౌన్ పొడిగింపు