ETV Bharat / bharat

యుద్ధనౌకల్లో తొలిసారిగా మహిళా అధికారుల నియామకం

భారత నావికాదళంలో తొలిసారిగా ఇద్దరు మహిళా అధికారులు నియమితులయ్యారు. సబ్‌ లెఫ్టినెంట్ హోదాలో ఆ ఇద్దరూ యుద్ధ విమానాల నిర్వహణలో సేవలందించనున్నారు.

in-historic-first-two-women-officers-to-operate-helicopters-from-warships
యుద్ధనౌకల్లో తొలిసారిగా మహిళా అధికారులు
author img

By

Published : Sep 21, 2020, 5:39 PM IST

భారత నావికాదళంలో తొలిసారిగా మహిళా అధికారులు కీలక బాధ్యతలు చేపట్టారు. సబ్‌ లెఫ్టినెంట్ కుముదిని త్యాగి, సబ్‌ లెఫ్టినెంట్ రీతిసింగ్‌లు కేరళ కొచ్చిలోని యుద్ధ నౌకలో యుద్ధ విమానాల నిర్వాహకులుగా నియమితులయ్యారు. ఆ అధికారులు ఇండియన్ నేవీ, ఇండియన్ కోస్ట్ గార్డ్ , ఆన్-బోర్డ్ మారిటైమ్ రికనైసెన్స్ , యాంటీ సబ్‌మెరైన్ యుద్ధ విమానాల్లో సేవలందిస్తారని ప్రకటించింది భారత నావికాదళం.

ఇప్పటివరకు, నావికాదళంలో మహిళా అధికారుల నియామకానికి బోలెడన్ని పరిమితులుండేవి. ఇప్పుడు నావికాదళంలో నారీశక్తి విస్తరణకు కుముదిని, రీతీసింగ్‌ల నియామకం ఓ మైలురాయిగా పేర్కొన్నారు నావల్ స్టాఫ్ చీఫ్, రేర్ అడ్మిరల్ ఆంటోనీ జార్జ్.

అరుదైన 'వింగ్స్' అవార్డు గ్రహీతలు.. కుముదిని త్యాగి, రీతీసింగ్‌లు ఎయిర్ నావిగేషన్, ఫ్లయింగ్ విధానాలు, వాయు యుద్ధంలో ఉపయోగించే వ్యూహాలు, జలాంతర్గామి వ్యతిరేక యుద్ధం వచ్చినప్పుడు ఎలా స్పందించాలి అనే వివిధ అంశాల్లో ఈ మహిళా అధికారులు శిక్షణ పొందారు.

ఇదీ చదవండి: రఫేల్​ దళంలోకి త్వరలో మహిళా పైలెట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.