బిహార్ హాజీపుర్లోని హిలాల్పుర్ చౌక్ వద్ద ఓ పెట్రోల్ బంక్లో చొరబడ్డ దుండగులు రెండు లక్షల రూపాయలు దోచుకెళ్లారు.
హెల్మెట్లు, ముసుగులు ధరించి రెండు ద్విచక్ర వాహనాలపై దర్జాగా వచ్చారా నలుగురు. తమతో తెచ్చుకున్న తుపాకీలు తీసి బంక్ సిబ్బందిని బెదిరించారు. క్యాష్ కౌంటర్ గదిలోకి తీసుకెళ్లమని దౌర్జన్యం చేశారు. సిబ్బంది నోరు మెదిపితే కొట్టి, తలపై తుపాకీ పెట్టి హడలెత్తించారు. మరో ఇద్దరు.. కౌంటర్లో ఉన్న డబ్బును తమ సంచిలో వేసుకున్నారు. సిబ్బంది జేబులో ఉన్న చిల్లరనూ వదలకుండా మొత్తం రెండు లక్షల రూపాయలు దోచుకెళ్లారు.
ఈ దృశ్యాలన్నీ సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. సిబ్బంది ఫిర్యాదు మేరకు దొంగలను పట్టుకునే పనిలో పడ్డారు పోలీసులు.
ఇదీ చూడండి:ఏటా రెండు సార్లే నడిచే రైలు.!