దేశంలో నెలకొన్న ఆర్థిక పరిస్థితులపై కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం.. మోదీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. నిరుద్యోగం పెరిగి, ఆదాయం తగ్గితే యువత, విద్యార్థుల్లో ఆగ్రహజ్వాలలు ఎగిసే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2019 డిసెంబరులో రిటైల్ ద్రవ్యోల్బణం 7.35 శాతానికి చేరింది. ఈ నేపథ్యంలో దేశంలో పెరుగతున్న ద్రవ్యోల్బణంపై చిదంబరం ఆందోళన వ్యక్తం చేశారు.
"దేశవ్యాప్తంగా సీఏఏ, ఎన్ఆర్సీపై నిరసనలు జరుగుతున్నాయి. సీఏఏ, ఎన్ఆర్సీ వల్ల ప్రమాదం పొంచి ఉందని ఈ నిరసనల చూస్తే అర్థమవుతోంది. ఆర్థిక మందగమనం ప్రధాన సమస్య. నిరుద్యోగం పెరిగి, ఆదాయం తగ్గితే.. యువత, విద్యార్థులు ఆగ్రహిస్తారు."
- చిదంబరం, కాంగ్రెస్ సీనియర్ నేత
ఉల్లి ధరలు ఆకాశానంటుతున్నాయన్న చిదంబరం.. భాజపా హామీనిచ్చిన మంచి రోజులు(అచ్ఛే దిన్) ఇవేనా అని ప్రశ్నించారు.
ఇదీ చూడండి: భారత్ జవాన్లపై బంగ్లా సైన్యం కాల్పులు- ఒకరు మృతి