ETV Bharat / bharat

'చట్టం విఫలమైతే.. ప్రజాస్వామ్యం కూలిపోతుంది' - అజిత్ దోవల్

చట్టాన్ని రూపొందించడం ప్రజాస్వామ్యంలో అత్యంత పవిత్రమైన పనని, చట్టాన్ని అమలు చేయడంలో పోలీసులు విఫలమైతే... ప్రజాస్వామ్యం కూడా విఫలమవుతుందని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ అభిప్రాయపడ్డారు. అందుకే పోలీసులు నిష్పాక్షికంగా, న్యాయబద్ధంగా పనిచేయాలని, విశ్వసనీయత పెంపొందించుకోవాలని సూచించారు.

If police 'fails' to enforce law, democracy fails: NSA Doval
చట్టం అమలులో విఫలమైతే.. ప్రజాస్వామ్యం కూలిపోతుంది: అజిత్ డోభాల్
author img

By

Published : Mar 5, 2020, 4:15 PM IST

పోలీసులు చట్టాన్ని అమలుచేయడంలో విఫలమైతే, ప్రజాస్వామ్యం కుప్పకూలుతుందని జాతీయ భద్రతా సలహాదారు (ఎన్​ఎస్​ఏ) అజిత్ డోభాల్​ అన్నారు. బ్యూరో ఆఫ్ పోలీసు రీసెర్చ్ అండ్ డెవలప్​మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన యువ పోలీసు సూపరింటెండెంట్లను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు.

"చట్టాన్ని రూపొందించడం ప్రజాస్వామ్యంలో అత్యంత పవిత్రమైన పని. మీరు (పోలీసు సిబ్బంది) ఆ చట్టాన్ని అమలు చేసేవారు. మీరు విఫలమైతే ప్రజాస్వామ్యం కూడా విఫలమవుతుంది."- అజిత్ డోభాల్​, జాతీయ భద్రతా సలహాదారు

ప్రజాస్వామ్యంలో చట్టానికి పూర్తిగా అంకితమవ్వడం చాలా ముఖ్యమని అజిత్ అన్నారు. పోలీసులు నిష్పాక్షికంగా, న్యాయబద్ధంగా పనిచేయాలని, విశ్వసనీయత పెంపొందించుకోవాలని సూచించారు. ప్రజల్లో పోలీసుల పట్ల నమ్మకం కల్పించడం మరింత ఆవశ్యకమని అభిప్రాయపడ్డారు డోభాల్​.

ఇదీ చూడండి: నిర్భయ దోషులకు డెత్​ వారెంట్​- మార్చి 20న ఉరి అమలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.