బిహార్ ప్రజలంతా తమవైపే ఉన్నారని చెప్పారు ఆర్జేడీ నేత, మహాకూటమి సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమదే విజయమని ధీమా వ్యక్తం చేశారు.
జాముయ్‌లో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న అనంతరం ఈటీవీ భారత్‌తో ప్రత్యేకంగా మాట్లాడారు తేజస్వీ. ప్రజల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామన్నారు. అవసరమైతే ఎల్జేపీ అధ్యక్షుడు చిరాగ్ పాసవాన్‌ను కూటమిలో చేర్చుకునేందుకు కూడా సిద్ధమని తేజస్వీ కీలక వ్యాఖ్యలు చేశారు.
భాజపా బీ-టీమ్..
బిహార్ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తున్న ఎల్జేపీని భాజపా బీ-టీమ్‌గా అభివర్ణించారు తేజస్వీ. పార్టీ పేరును ప్రస్తావించకుండా పరోక్షంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఓట్లు చీల్చేందుకు భాజపానే ఈ వ్యూహం రూపొందించినట్లు చెప్పారు. ఈ విషయంపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మొకమా, షేక్‌పుర, జూముయ్, నవాదా ర్యాలీల్లో సూచించారు.
బిహార్ అసెంబ్లీ ఎన్నికలు మూడో విడతల్లో అక్టోబర్ 28, నవంబర్ 3, నవంబర్ 7న జరగనున్నాయి. 10న ఫలితాలు వెలువడుతాయి.