ETV Bharat / bharat

80 ఏళ్లలో మొదటి సారి రామ్​లీలా వేడుకలకు బ్రేక్​! - ఆర్కియాలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా న్యూస్​

దిల్లీలోని ఎర్రకోట మైదానంలో జరిగే రామ్​లీలా వేడుకలకు కొవిడ్​ మహమ్మారి ఆటంకంగా నిలిచింది. ఏఎస్​ఐ అనుమతి లేని కారణంగా ఈ సారి ఉత్సవాలను నిర్వహించటం లేదని తెలిపింది లవ్‌కుశ్‌ రామ్‌లీలా కమిటీ. గత 80 ఏళ్లలో ఇక్కడ వేడుకలు నిర్వహించకపోవటం ఇదే తొలిసారి.

iconic ramleela celebrations in delhi wont be held this year says lavkush ramleela committee
80 ఏళ్లలో మొదటి సారిగా.. రామ్​ లీలా వేడకలకు బ్రేక్​
author img

By

Published : Oct 13, 2020, 7:01 AM IST

కరోనా మహమ్మారి కారణంగా దిల్లీలోని ఎర్రకోట మైదానంలో ఈసారి రామ్‌లీలా వేడుకలను నిర్వహించటం లేదని లవ్‌కుశ్‌ రామ్‌లీలా కమిటీ పేర్కొంది. ఏఎస్‌ఐ (ఆర్కియాలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా) కార్యక్రమానికి ఇంకా అనుమతి ఇవ్వలేదని వివరించింది. సాధారణంగా ఏటా ఇక్కడ జరిగే వేడుకలలో దేశ ప్రధాని, రాష్ట్రపతి పాల్గొంటారు.

తప్పనిసరి..

గత 80 ఏళ్లలో ఇక్కడ వేడుకలు లేకపోవటం ఇదే మొదటిసారి. రామ్‌లీలా, దుర్గాపూజ ఉత్సవాలను నిర్వహించుకోవచ్చని దిల్లీ ప్రభుత్వం ఆదివారం తెలిపింది. కానీ తాము నిర్దేశించిన కొవిడ్‌ నిబంధనలు పాటించడం తప్పనిసరి అని పేర్కొంది.

"మేము రామ్‌లీలా నిర్వహించాలని మొదట అనుకున్నాం. కానీ ఎర్రకోట మైదానం ఏఎస్‌ఐ పరిధిలోకి వస్తుంది. వారి నుంచి ఇప్పటి వరకు అనుమతి లభించలేదు. ఈ నేపథ్యంలో దిల్లీ ప్రభుత్వం నిర్దేశించిన నియమాల అనుసరణ ఆచరణాత్మకంగా సాధ్యం కాదు. ప్రభుత్వమూ అయిష్టంగానే ఉన్నట్లుంది. రాబోయే పదిరోజులలో ఏదైనా అవకాశం వస్తే ఒక్కరోజు వేడుకను నిర్వహిస్తాం. అయితే ప్రజల ఆరోగ్య భద్రత ముఖ్యమే. ఏ మతపరమైన కార్యక్రమం మహమ్మారి సంక్రమణకు కారణం కాకూడదు."

-- లవ్‌కుశ్‌ రామ్‌లీలా కమిటీ

దేశంలో లవ్‌కుశ్‌ రామ్‌లీలా కమిటీ నిర్వహించే రామ్‌లీలా వేడుకలే పెద్దవి. 600 మందికి పైగా కళాకారులు ఇందులో పాల్గొంటారు. .

ఇదీ చూడండి:కోయంబేడులో మళ్లీ కరోనా కలకలం.!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.