ETV Bharat / bharat

కరోనా కట్టడికి టీబీ టీకా వాడకంపై పరిశోధనలు - కరోనా వైరస్​ ఇండియా

కరోనా వైరస్​ నివారణకు బీసీజీ వ్యాక్సిన్​ వినియోగంపై వచ్చే వారం నుంచి పరిశోధన చేపట్టనుంది ఐసీఎం​ఆర్​. ఈ బీసీజీ వ్యాక్సిన్​ను క్షయ వ్యాధి నివారణకు వినియోగిస్తున్నారు. అయితే కచ్చితమైన ఫలితాలు వెలువడేంత వరకు ఈ వ్యాక్సిన్​ను వైరస్​ చికిత్సకు సిఫార్సు చేయబోమని స్పష్టం చేసింది ఐసీఎం​ఆర్​.

ICMR will conduct study to find effectiveness of BCG vaccine against COVID-19
క్షయ టీకాతో కరోనా​కు విరుగుడు! ఐసీఎమ్​ఆర్​ పరిశోధన
author img

By

Published : Apr 18, 2020, 12:42 PM IST

క్షయ వ్యాధి నివారణకు వినియోగించే టీకా.. కరోనా నియంత్రణకు ఏ మేరకు ఉపయోగపడుతుందనే అంశంపై పరిశోధన జరపనున్నట్టు ఐసీఎం​ఆర్​(భారత వైద్య పరిశోధన మండలి) తెలిపింది. అయితే కచ్చితమైన ఫలితాలు వెలువడేంత వరకు ఈ వ్యాక్సిన్​ను వైరస్​ చికిత్సకు సిఫార్సు చేయబోమని స్పష్టం చేసింది.

బాసిలస్​ కాల్మెటే- గురిన్​(బీసీజీ) అనే వ్యాక్సిన్​ను క్షయ వ్యాధి నివారణకు వినియోగిస్తారు. మనిషి పుట్టిన వెంటనే ఈ బీసీజీ వ్యాక్సిన్​ను అందిస్తారు. అయితే దీని వల్ల క్షయ సోకదు అని కచ్చితంగా చెప్పలేకపోయినా.. కొంతమేర వరకు రక్షణ కల్పిస్తుంది.

వైరస్​ చికిత్సకు ఈ వ్యాక్సిన్​ ఉపయోగపడుతుందా? లేదా? అనే అంశంపై వచ్చే వారం నుంచి పరిశోధన జరపనున్నట్టు ఐసీఎం​ఆర్​ తెలిపింది. అయితే ఈ వ్యాక్సిన్​తో లాభాలు తక్కువనే అంటున్నారు ఐసీఎం​ఆర్​లోని ఎపిడెమియోలజీ అండ్​ కమ్యూనికబుల్​ డిసీజెస్​ విభాగ అధిపతి డా. గంగాఖేద్కర్​.

"కరోనా విషయంలో బీసీజీ పని చేసే అవకాశాలు తక్కువే. ఎందుకంటే బీసీజీ 15ఏళ్లు మాత్రమే రక్షణ కల్పిస్తుంది. తిరిగి వ్యాక్సిన్​ను యుక్తవయసులోనే వేయాలి. అందుకే 70ఏళ్ల కరోనా రోగిపై ఇది పనిచేయదు. అదే సమయంలో 15ఏళ్ల తర్వాత వ్యాక్సిన్​ తిరిగి తీసుకున్నా.. వైరస్​ బారిన పడరని చెప్పడానికి సరైన ఆధారాలు లేవు."

- డా. గంగాఖేద్కర్​, ఎపిడెమియోలజీ అండ్​ కమ్యూనికబుల్​ డిసీజెస్​ హెడ్​

ఇదీ చూడండి:- రూ.600తో 20 నిమిషాల్లోపే కరోనా పరీక్ష ఫలితాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.