ETV Bharat / bharat

ఐసీఎంఆర్​ కొత్త రూల్స్- కరోనా పరీక్షలు వారికే...

కరోనా కేసులు నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఎవరెవరికి ఏ సమయంలో నిర్ధరణ పరీక్షలు నిర్వహించాలన్న విషయంలో స్పష్టతనిచ్చింది.

VIRUS-REVISED-TESTING-STRATEGY
కరోనా పరీక్షలు
author img

By

Published : May 18, 2020, 7:59 PM IST

కరోనా వైరస్ నిర్ధరణ పరీక్ష విధానాల్లో భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్​) పలు మార్పులు చేసింది. దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.

కొత్త మార్గదర్శకాల ప్రకారం..

  • విదేశాల నుంచి వచ్చినవారు, వలస కార్మికులకు ఫ్లూ లక్షణాలు ఉంటే 7 రోజుల్లోగా కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించాలి
  • ఫ్లూ లక్షణాలు ఉండి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నవారిని పరీక్షించాలి.
  • తీవ్ర శ్వాస కోశ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తులకు టెస్టులు చేయాలి
  • కంటైన్మెంట్​ జోన్లలో తీవ్ర అస్వస్థతకు గురైన వాళ్లకు పరీక్షలు జరపాలి.
  • కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్న వైద్యులు, ఆరోగ్య సిబ్బందికి ఆర్​టీ-పీసీఆర్​ ద్వారా వారికి కరోనా పరీక్షలు నిర్వహించాలి.
  • పాజిటివ్​ వ్యక్తులతో అత్యంత సన్నిహితంగా మెలిగినవారిలో వైరస్​ సోకే అవకాశం ఉండేవారిని 5 నుంచి 10 రోజుల మధ్యలో ఒకసారి కచ్చితంగా పరీక్షించాలి.
  • సన్నిహితంగా ఉన్న వ్యక్తుల్లో లక్షణాలు లేకున్నా 5 నుంచి 14 రోజులలోపు పరీక్ష నిర్వహించాలి.
  • ఎలాంటి సమస్యలు ఉన్నా కరోనా పరీక్షలు నిర్వహించటంలో ఆలస్యం చేయకూడదు.

ఫ్లూ లక్షణాలు..

ఇన్​ఫ్లూయెంజా లక్షణాలు ఉన్నవారిలో సుమారు 38 డిగ్రీల సెల్సియస్ జ్వరంతో పాటు తీవ్ర శ్వాసకోశ ఇబ్బందులు ఉంటాయి. దగ్గు కూడా విపరీతంగా వస్తుంది.

దేశంలో రోజురోజుకీ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇప్పటివరకు 96,169 కేసులు నమోదు కాగా.. 3,029 మంది మరణించారు. 36వేల మందికిపైగా కోలుకున్నారు.

ఇదీ చూడండి: 'కరోనా కాలంలో సరికొత్త జీవనశైలి అవసరం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.