2016లో విచ్ఛిన్నమైన భారత వైమానిక దళానికి చెందిన నం. 17 స్క్వాడ్రన్ నేడు తిరిగి పునరుజ్జీవం పోసుకోనుంది. రఫెల్ యుద్ధ విమానాలు నడిపే తొలి బృందమే ఈ 'గోల్డన్ యారోస్' 17 స్క్వాడ్రన్. అనేక సైనిక విమానాలు.. వాటి సిబ్బందిని కలిపి ఒక స్క్వాడ్రన్గా పిలుస్తారు.
నేడు అంబాల వాయు స్థావరంలో జరగనున్న ఓ వేడుకలో 17 స్క్వాడ్రన్ను పునరుత్థానం చేయనున్నారు ఐఏఎఫ్ అధిపతి బీఎస్ ధనోవా. ఈ నెల చివర్లో తొలి రఫెల్ విమానాన్ని వాయుసేన అందుకునే అవకాశముంది. అంబాల వాయు స్థావరంలో ఈ యుద్ధ విమానాన్ని మోహరించనున్నట్టు సమాచారం.
1999 కార్గిల్ యుద్ధంలో ఈ 17 స్క్వాడ్రన్కు వాయుసేన అధిపతి ధనోవా నాయకత్వం వహించారు. మిగ్ 21 విమనాలను దశల వారిగా తొలగించడానికి ఐఏఎఫ్ నిర్ణయించడం వల్ల 2016లో ఈ స్క్వాడ్రన్ విచ్ఛిన్నమైంది.
రఫెల్ కోసం వాయుసేన తీవ్ర కసరత్తు చేసింది. పైలట్లకు శిక్షణతో సహా యుద్ధవిమానికి సంబంధించిన మౌలిక వసతులను సిద్ధం చేసింది.
ఇదీ చూడండి:- 'భారత వాయుసేనలో రఫేల్ మరో గేమ్ ఛేంజర్'