ETV Bharat / bharat

ఆ రాష్ట్రంలో భూమి కోసం వాయుసేన మంతనాలు

author img

By

Published : Sep 12, 2020, 4:36 PM IST

వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్తతల నేపథ్యంలో సదుపాయాలపై వాయుసేన దృష్టి సారించింది. ఈ మేరకు ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్​తో ఎయిర్​ మార్షల్​ రాజేశ్ కుమార్​ భేటీ అయ్యారు. రాష్ట్రంలో పలు సదుపాయాల ఏర్పాటు కోసం భూమి లభ్యతపై చర్చించారు.

UKD-IAF-LAND
వాయుసేన

చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో ఉత్తరాఖండ్​ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్​​తో ఎయిర్​ మార్షల్ రాజేశ్ కుమార్ భేటీ అయ్యారు. వాస్తవాధీన రేఖ వెంబడి సదుపాయాల ఏర్పాటు కోసం భూమి ఇవ్వాలని కోరారు.

ఈ భేటీలో వ్యూహాత్మక ప్రాముఖ్యం కారణంగా రాష్ట్రంలోని కొండ ప్రాంతాల్లో వాయు రక్షణ రాడార్లు, ముందస్తు ల్యాండింగ్ గ్రౌండ్‌ను నిర్మించడానికి భూమి లభ్యతపై చర్చించారు. చౌఖుటియాలో విమానాశ్రయానికి భూమిని కేటాయించటంతో పాటు పంత్‌నగర్, జాలీగ్రాంట్, పితోర్​గఢ్​ ఎయిర్​పోర్టులను విస్తరించాలని ఎయిర్ మార్షల్ కోరారు.

సరిహద్దు రాష్ట్రం..

నేపాల్​, చైనాతో ఉత్తరాఖండ్​ సరిహద్దు పంచుకుంటోంది. ఇక్కడి చమోలీ, పితోర్​గఢ్​, ఉత్తర్​కాశీ జిల్లాల్లో రాడార్లు, ల్యాండింగ్​ సదుపాయాల ఏర్పాటుతో సైన్యానికి మరింత బలం చేకూరుతుందని సెంట్రల్ ఎయిర్​ కమాండ్ చీఫ్​గా ఉన్న రాజేశ్​ వివరించారు.

ఇదీ చూడండి: చైనా సరిహద్దు మరో నియంత్రణ రేఖగా మారుతుందా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.