భారత వాయుసేన అత్యంత శక్తిమంతమైన బ్రహ్మోస్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. 300 కి.మీ దూరంలో ఉండే లక్ష్యాన్ని ఛేదించగల ఈ క్షిపణి ప్రయోగాన్ని సు-30 ఎంకేఐ యుద్ధ విమానం ద్వారా నిర్వహించింది. ధ్వని కన్నా దాదాపు మూడు రెట్లు వేగంగా ప్రయాణించగల సామర్థ్యం ఈ బ్రహ్మోస్ ప్రత్యేకత. ఈ ఘనత సాధించిన ఏకైక దేశంగా అవతరించింది.
నవంబర్ 22, 2017లో మొదటిసారి ఇదే తరహా ప్రయోగాన్ని సముద్రంపై విజయవంతంగా నిర్వహించింది వాయుసేన.
బ్రహ్మోస్ క్షిపణి ప్రయోగాన్ని రెండోసారి.. నేలపై లక్ష్యాన్ని ఛేదించేందుకు బుధవారం ప్రయోగించారు. ఈ ప్రయోగంతో భారత వాయుసేన సామర్థ్యం బలోపేతమైందని పేర్కొన్నారు ఐఏఎఫ్ ప్రతినిధి అనుపమ్ బెనర్జీ.
ఇదీ చూడండి: 'రఫేల్' కార్యాలయంలో చోరీకి యత్నం...!