ETV Bharat / bharat

ఇరాన్​కు బయలుదేరిన భారత వైమానిక దళ విమానం - C-17 Globemaster

కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇరాన్​లోని భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు భారత వైమానిక దళ విమానం బయలుదేరింది. మంగళవారం తెల్లవారుజామున టెహ్రాన్​ చేరుకోనుంది. భారతీయులను తీసుకుని రేపు ఉదయం 9:30 గంటల ప్రాంతంలో తిరిగి స్వదేశానికి చేరుకుంటుంది.

C-17 Globemaster
ఇరాన్​కు బయలుదేరిన భారత వైమానిక దళ విమానం
author img

By

Published : Mar 9, 2020, 9:16 PM IST

Updated : Mar 10, 2020, 12:00 AM IST

ఇరాన్​కు బయలుదేరిన భారత వైమానిక దళ విమానం

కరోనా మహమ్మారికి కేంద్ర బిందువైన చైనా తర్వాత ఇరాన్​లో​ ఈ వైరస్​ వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే 237 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇరాన్​లో 7వేల మందికిపైగా వైరస్​ బారినపడిన నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టింది కేంద్ర ప్రభుత్వం​. వారి కోసం వైమానిక దళానికి చెందిన సీ-17 గ్లోబ్​మాస్టర్​ మిలిటరీ విమానం ఉత్తర్​ప్రదేశ్​లోని హిందోన్​ ఎయిర్​బేస్​ నుంచి బయలుదేరి వెళ్లింది.

మంగళవారం ఉదయానికి భారత్​కు..

సోమవారం రాత్రి 8:30 గంటల ప్రాంతంలో హిందోన్​ ఎయిర్​బేస్​ నుంచి బయలుదేరిన వైమానిక దళ విమానం సీ-17 మంగళవారం తెల్లవారుజామున 2 గంటలకు ఇరాన్​లోని టెహ్రాన్​ చేరుకుంటుంది. భారతీయులను తీసుకుని ఉదయం 4:30 గంటల ప్రాంతలో భారత్​కు పయనమవుతుంది. మంగళవారం ఉదయం 9:30 గంటలకు హిందోన్​ ఎయిర్​బేస్​కు చేరుతుంది. ఇరాన్​ నుంచి వచ్చేవారి కోసం హిందోన్​లో ప్రత్యేక నిర్బంధ కేంద్రాలు ఏర్పాటు చేశారు అధికారులు.

2వేల మంది..

ఇరాన్​లో సుమారు 2,000 మంది భారతీయులు ఉన్నట్లు అంచనా. వారందరినీ తరలించేందుకు ప్రణాళిక చేస్తున్నారు అధికారులు.

300 మంది నమూనాలు..

మూడు రోజుల క్రితం ఇరాన్​లోని సుమారు 300 మంది భారతీయుల రక్త నమూనాల​ను భారత్​కు తీసుకొచ్చింది మహాన్​ ఎయిర్​లైన్​ విమానం.

సీ-17 గ్లోబ్​మాస్టర్​ ద్వారా..

గడిచిన రెండు వారాల్లోపు సీ-17 గ్లోబ్​మాస్టర్​ విమానం ద్వారా భారతీయులను తరలించటం ఇది రెండోసారి. గత నెల ఫిబ్రవరి 27న చైనాలోని వుహాన్​ నుంచి 76 మంది భారతీయులు, 36 మంది విదేశీయులను ఈ విమానంలోనే భారత్​కు తరలించారు. చైనాకు వైద్య సామగ్రిని తరలించేందుకూ సీ-17 విమానాన్నే వినియోగించారు.

ఇదీ చూడండి: భారత్​లో 45కు పెరిగిన కరోనా కేసుల సంఖ్య

Last Updated : Mar 10, 2020, 12:00 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.