ETV Bharat / bharat

కొవిడ్‌-19 నివారణకు హైడ్రాక్సీ క్లోరోక్విన్‌

ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా వైరస్​పై పలు దేశాల శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వైరస్​పై​ హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ సమర్థంగా పనిచేస్తుందని భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్‌) వెల్లడించింది. సంబంధిత ప్రొటోకాల్‌కు భారత ఔషధ నియంత్రణ జనరల్‌(డీసీజీఐ) ఆమోద ముద్ర వేసినట్లు పేర్కొంది. కరోనా బాధితులు, అనుమానిత రోగులకు వైద్య సేవలు అందించే సిబ్బందికి కొవిడ్‌ లక్షణాలు లేకపోయినా హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను అందించవచ్చు.

Hydroxy chloroquine for coronavirus prevention
కొవిడ్‌-19 నివారణకు హైడ్రాక్సీ క్లోరోక్విన్‌
author img

By

Published : Mar 24, 2020, 8:19 AM IST

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిపై హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ సమర్థంగా పనిచేస్తుందని భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్‌) వెల్లడించింది. వైరస్‌ సోకే ముప్పు ఎక్కువగా ఉన్నవారిలో నివారణ చర్యల్లో భాగంగా ఈ ఔషధాన్ని ఉపయోగించవచ్చునని పేర్కొంది. కొవిడ్‌-19పై తాము ఏర్పాటుచేసిన జాతీయ కార్యదళం ఈ మేరకు సిఫార్సు చేసినట్లు తెలిపింది. సంబంధిత ప్రొటోకాల్‌కు భారత ఔషధ నియంత్రణ జనరల్‌(డీజీసీఐ) ఆమోద ముద్ర వేసినట్లు పేర్కొంది. హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ వినియోగంపై మార్గదర్శకాలు విడుదల చేసింది.

ఎవరికి ఇవ్వొచ్చు?

  • కరోనా బాధితులు, అనుమానిత రోగులకు వైద్య సేవలు అందించే సిబ్బందికి కొవిడ్‌ లక్షణాలు లేకపోయినా హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను అందించవచ్చు.
  • కరోనా సోకినవారి కుటుంబ సభ్యులకు వ్యాధి లక్షణాలు లేకపోయినా ఇవ్వొచ్చు.
  • ఈ ఔషధాన్ని తీసుకుంటే తాము క్షేమంగా ఉంటామని అపోహపడొద్దు. ఎప్పటిలాగానే తగిన ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. తరచూ చేతులు కడుక్కోవాలి. శ్వాస సంబంధిత జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యక్తిగత భద్రతా చర్యలు తీసుకోవాలి.
  • వైద్య సిబ్బంది తమ ఆరోగ్యాన్ని నిరంతరం గమనించుకుంటూ ఉండాలి. తమలో కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యాధికారులకు సమాచారం అందించాలి.
  • కరోనా బాధితులతో హై రిస్క్‌ కాంటాక్ట్స్‌ ఉన్నవారు రోగ నిరోధక చికిత్స తీసుకుంటున్నప్పటికీ ఇంటికెళ్లాక నిర్బంధంలో ఉండాలి.
  • హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను రిజిష్టర్డ్‌ మెడికల్‌ ప్రాక్టీషినర్‌ సూచనల మేరకే తీసుకోవాలి. దుష్ప్రభావాల ముప్పుంటే వాడకూడదు.
  • జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి కొవిడ్‌-19 లక్షణాలతో ఉన్న వ్యక్తులు ఈ ఔషధాన్ని వినియోగిస్తున్నప్పుడు ఏవైనా ఇతర లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.

మోతాదు ఎంత?

  • వైద్య సేవలు అందిస్తున్న సిబ్బంది తొలి రోజు రెండుసార్లు 400 ఎం.జి. వాడాలి. తర్వాత ఏడు వారాలపాటు వారానికి ఒకసారి 400 ఎం.జి. మోతాదులో భోజనంతో కలిపి తీసుకోవాలి.
  • కొవిడ్‌-19 రోగులతో కలిసి ఇంట్లో ఉంటున్న కుటుంబ సభ్యులు తొలి రోజు రెండుసార్లు 400 ఎం.జి. తీసుకోవాలి. తర్వాత మూడు వారాలపాటు వారానికి 400 ఎం.జి. ఔషధాన్ని భోజనంతోపాటు తీసుకోవాలి.

ఏమేం జాగ్రత్తలు పాటించాలి?

  • 15 ఏళ్లలోపు చిన్నారుల్లో ముందస్తు నివారణ కోసం హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను ఉపయోగించకూడదు.
  • దాని వినియోగంతో దుష్ప్రభావాలు తలెత్తితే హెల్ప్‌లైన్‌ ద్వారా గానీ, యాప్‌ ద్వారా గానీ ఫిర్యాదు చేయాలి.
  • కొవిడ్‌ బాధితులతో సంబంధమున్నవారు ఈ ఔషధంతో నివారణ చర్యలు తీసుకుంటున్నప్పటికీ జాతీయ మార్గదర్శకాల ప్రకారం ఇంట్లోనే నిర్బంధంలో ఉండాలి.

ముందు జాగ్రత్తలో భాగంగానే

కరోనా సోకే ముప్పు ఎక్కువగా ఉన్నవారు హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ ఔషధాన్ని వాడాలి. అది కూడా ముందస్తు నివారణ చర్యల్లో భాగంగానే. ఈ ఔషధ నిల్వలు మన దేశంలో తగినంతగా ఉన్నాయి.

- బలరాం భార్గవ, ఐసీఎంఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌

ఇదీ చూడండి: కొవిడ్​-19పై పోరాటానికి విరాళాల వెల్లువ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.