కొవిడ్-19ను అరికట్టేందుకు భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ క్యాండిడేట్ కొవాగ్జిన్ హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్ సోమవారం ఒడిశాలో ప్రారంభమయ్యాయి.
భువనేశ్వర్‌లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్- ఎస్యూఎం ఆస్పత్రిలో బీబీవీ-152 కొవిడ్ వ్యాక్సిన్(కొవాగ్జిన్) ట్రయల్స్ నిర్వహించారు. స్వచ్ఛందంగా ముందుకొచ్చిన వారికే వ్యాక్సిన్ అందించామని ట్రయల్స్ ప్రధాన పరిశీలకులు డాక్టర్ వెంకట్ రావు తెలిపారు.
ఇదీ చదవండి: క్లినికల్ ట్రయల్స్‌లో వేగం పెంచిన 'సీరం'