కర్ణాటక చిక్‌మంగళూరులో ఓ భారీ కొండచిలువను స్థానికులు పట్టుకున్నారు. సుమారు 14 అడుగులు పొడవుండే ఈ పాము.. ముదిగెరె ప్రాంతంలోని ఓ కాఫీ తోటలో బయటపడింది.
కొండచిలువ ఉన్న విషయాన్ని.. స్థానిక పాముల ప్రేమికుడు రిజ్వాన్‌తో చెప్పారు పొలం యజమాని. తక్షణమే అక్కడికి చేరుకున్న రిజ్వాన్.. చాకచక్యంగా వ్యవహరించి ఆ కొండచిలువను రక్షించారు. అనంతరం అటవీ శాఖ అధికారులకు అప్పగించారు.
ఇదీ చదవండి: వ్యవసాయంపై మక్కువతో మేడపైనే వరిసాగు