ETV Bharat / bharat

కరోనాపై 'మిషన్​ ధారావి' ఎలా విజయం సాధించింది?

కరోనా మహమ్మారి ధాటికి ముంబయి గడగడలాడుతోంది. అయితే ఆసియాలోనే అతిపెద్ద మురికివాడ అయిన 'ధారావి'లో మాత్రం కొత్త కేసులు, మరణాలు గణనీయంగా తగ్గుతూ వస్తున్నాయి. యావత్​ దేశానికే ఆదర్శంగా మారింది ధారావి. అక్కడి మున్సిపాలిటి, పోలీసు, వైద్య సిబ్బంది, ఎన్​జీఓలు కలిసి 'మిషన్​ ధారావి'తో మహమ్మారిని అరికట్టారు. మరి సగటున వెయ్యి మందికి ఒక్క మరుగుదొడ్డి వసతి ఉన్న ఆ ఇరుకువాడలో... కొవిడ్​ను ఎలా కట్టడి చేశారు?

How 'Dharavi Mission' helped Asia's largest slum to achieve victory against Corona
కరోనాపై 'మిషన్​ ధారావి' ఎలా విజయం సాధించింది?
author img

By

Published : Jun 28, 2020, 8:16 PM IST

Updated : Jun 28, 2020, 8:21 PM IST

ఆసియాలోనే అతిపెద్ద మురికివాడ అయిన మహారాష్ట్రలోని ధారావిలో కొవిడ్​ వ్యాప్తి గణనీయంగా తగ్గింది. 'మిషన్​ ధారావి' ప్రణాళికతో భారీ సవాలును జయించింది బృహన్​ ముంబయి కార్పొరేషన్(బీఎంసీ).

  • ఇరుకే సవాలు...

దేశ ఆర్ధిక రాజధాని ముంబయి నగరంలో అద్దాల మేడలు.. దీపకాంతుల వన్నెలు ఓ వైపుంటే... వాటి వెనకాలే సూర్యకాంతి కూడా ప్రవేశించలేని ఇరుకైన 'ధారావి' మురికివాడ ఉంది. ధారావి ఆసియాలోనే అతిపెద్ద స్లమ్​ ఏరియా. పొట్టచేతబట్టుకుని పని కోసం నగరానికి వచ్చే వలస కూలీలు.. దాదాపు ఇక్కడే తలదాచుకుంటారు. గాలి కూడా సరిగ్గా రాని ఒకే గదిలో ఓ కుటుంబమంతా గడపాలి. స్నానాలు, కాలకృత్యాలకు వందల కుటుంబాలకు కలిపి ప్రజా మరుగుదొడ్లుంటాయి. ఇంత కిక్కిరిసిన వాడలో 2 మీటర్ల భౌతిక దూరం పాటించి, కరోనా సోకకుండా చూడడం పెద్ద సవాలే.

  • వైద్యుల సహకారంతో..
    How 'Dharavi Mission' helped Asia's largest slum to achieve victory against Corona
    కరోనా పోరులో 'మిషన్​ ధారావి' విజయం!

ప్రైవేటు వైద్యుల భాగస్వామ్యంతో మహమ్మారి వ్యాప్తిని అరికట్టడంలో బీఎంసీ కీలకపాత్ర పోషించింది. తొలుత కరోనా లక్షణాలు కనిపించినా.. ఆసుపత్రికి వెళ్లేవారు కాదు అక్కడి ప్రజలు. ఆసుపత్రికి వెళితే, తమ చుట్టుపక్కల వారు కరోనా సోకినందుకు తమ కుటుంబాన్ని వెలివేస్తారనే భయమే ఇందుకు కారణం. అందుకే, ఏళ్లుగా ఆ ధారావి వాడల్లోకి వెళ్లి వైద్యం చేస్తున్న ప్రైవేటు వైద్యుల సహకారంతో తొలుత ఆ భయాన్ని పోగొట్టింది బీఎంసీ.

ప్రైవేటు ప్రాక్టీషనర్లనూ క్షేత్రస్థాయిలో మోహరించి ప్రజల్లో నమ్మకాన్ని పెంచింది. వారికి పీపీఈ కిట్లు, థర్మల్‌ స్కానర్లు, పల్స్‌ ఆక్సీమీటర్లు, మాస్కులు, చేతి తొడుగులు సమకూర్చి.. ట్రేసింగ్‌, ట్రాకింగ్‌, టెస్టింగ్‌, ట్రీటింగ్‌ అనే ‘4టీ’ విధానానికి శ్రీకారం చుట్టింది.

ధారావిలో గత 35ఏళ్లుగా సేవలందిస్తున్న ఇండియన్ మెడికల్​ కౌన్సిల్​ అధికారి, డాక్టర్​ అనిల్​ పచ్నేకర్... కరోనా కట్టడిలో తమ బృందం ఎలా పనిచేసిందో ఈటీవీ భారత్​తో పంచుకున్నారు. ​

"ఇక్కడ కరోనా విజృంభణ మొదలయినప్పుడు.. ధారావిలో నా ఆసుపత్రి మాత్రమే తెరిచి ఉంది. మా నియోజకవర్గ పార్లమెంట్​ సభ్యుడు రాహుల్​ శివాజీ నాతో మాట్లాడి డోర్​ టు డోర్​ సర్వే నిర్వహించారు. ఆపై మొదటి దశలో మా బృందం ఇంటింటికి వెళ్లి వారం రోజుల్లో దాదాపు 50 వేలమంది నుంచి నమూనాలు స్వీకరించింది. వారిలో 20 శాతం మందికి కరోనా పాజిటివ్​గా తేలింది. దీంతో రెండో దశలో కరోనా సోకినవారి చుట్టుపక్కల వారిని క్వారంటైన్ చేశాం. ఉచితంగా వైద్య సేవలందించాం. ఇక మూడో దశలో ఇంటింటికి వెళ్లి కరోనా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరాన్ని ప్రజలకు తెలియజేశాం. దీంతో కేసులు చాలా వరకు తగ్గాయి."

-డాక్టర్​ అనీల్​ పచ్నేకర్​

  • లాక్​డౌన్​ సడలింపులతో ఊరట..

లాక్​డౌన్​ సడలింపులతో ఈ మురికివాడలో నివసిస్తున్న దాదాపు 4లక్షల మంది వలస కూలీలు స్వస్థలాలకు వెళ్లిపోయారు. దీంతో అక్కడ జనసాంద్రత తగ్గింది. ఇక కరోనా పరీక్షలను వేగవంతం చేసింది నగరపాలక సంస్థ. ధారావిని కంటైన్మెంట్​గానే కొనసాగిస్తూ... పోలీసులు, వైద్యుల సహాయంతో ఇంటింటికి వెళ్లి సర్వే నిర్వహించింది. మొబైల్​ వ్యాన్లలో వైద్య సేవలందించింది.

5,48,270 మందిని స్క్రీన్‌ చేసి అనుమానితులను కొవిడ్‌ కేర్‌ సెంటర్లు, క్వారంటైన్‌ కేంద్రాలకు తరలించారు వైద్యులు. అదే సమయంలో ముంబయివ్యాప్తంగా ప్రైవేటు ఆస్పత్రులను ప్రభుత్వం తన అధీనంలోకి తీసుకుంది. వాటిలోనే ధారావి సహా పలు ప్రాంతాల పేదలకు వైద్యం అందించింది. ఆ పరిసరాలను శానిటైజ్​ చేసింది. మాస్కులు, శానిటైజర్లు, గ్లౌజులు ఉచితంగా పంచారు పోలీసులు.

పాఠశాలలు, కల్యాణ వేదికలు, క్రీడా ప్రాంగణాలను క్వారంటైన్‌ కేంద్రాలుగా మార్చారు. వాటిలోనే సామాజిక వంటశాలలను ఏర్పాటు చేసి 21వేల మందికి మూడు పూటలా భోజనాలు సమకూర్చినట్టు బీఎం​సీ డిప్యూటీ మునిసిపల్​ కమిషనర్ కిరణ్​​ దిఘావ్కర్ తెలిపారు​. దీంతో రోజుకు వందల సంఖ్యలో నమోదైన వైరస్​ కేసులకు కళ్లెం పడిందన్నారు.

క్రెడాయ్​-ఎంసీహెచ్​ఐ, భారతీయ జైన్​ సంఘటన్ వంటి ఎన్​జీఓల సాయంతో.. పోలీసులు ప్రాణాలకు తెగించి ప్రజల్లో అవగాహన కల్పించారు.

"ధారావిలో 95శాతం మంది లాక్​డౌన్​ను పాటించారు. కానీ, 5శాతం మంది కరోనా జాగ్రత్తలను పట్టించుకోకుండా రోడ్లపై తిరిగేవారు. ధారావిలో పగలే చీకటిగా ఉంటుంది. ఇరుకు ఇళ్ల కారణంగా సూర్యరశ్మి తక్కువగా వచ్చేది. దీంతో ఆసుపత్రికి వెళ్లేందుకు బయటికి వచ్చినా పక్కవారికి సులభంగా వైరస్​ సోకేది. మేము గల్లీగల్లీల్లో తిరిగి పని చేశాం. 32 మందికి కరోనా సోకింది. ఆ తర్వాత మరింత జాగ్రత్తగా పని చేశాం.. కరోనా జాగ్రత్తలు పాటించాం. మాస్కులు , శానిటైజర్లు పంచి ప్రజలకు వైరస్​ గురించి వివరించాం. ఆ తర్వాత కరోనా​ వ్యాప్తి తగ్గింది."

-రమేశ్​ నాంగ్రే, సీనియర్​ పోలీస్​ ఇన్​స్పెక్టర్​.

  • జన చైతన్యమే కీలకం...

వీటితో పాటు.. సామాజిక ఐకమత్యం అన్నింటికంటే కీలక పాత్ర పోషించింది. వారిలో ఆత్మ స్థైర్యం నింపుకుని, స్వచ్ఛందంగా కరోనా జాగ్రత్తలు పాటించారు అక్కడి ప్రజలు. వేరువేరు కుటుంబాలైనప్పటికీ ఓ పెద్ద కుటుంబంగా ఒకరికొకరు సాయం చేసుకున్నారు. అయితే, మహారాష్ట్రలో ప్రస్తుతం వైద్య సిబ్బంది కొరత ఉంది. అధిక మానవ వనరులను ప్రభుత్వం సమకూర్చగలిగితే.. కరోనా కోరల నుంచి ధారావి పూర్తిగా కోలుకునే అవకాశాలున్నాయి.

ధారావిలో ఆదివారం కేవలం 13 కేసులే నమోదయ్యాయి. ఈ మురికివాడలో ఇప్పటివరకు 2,245 మందికి వైరస్​ సోకింది. 81 మంది మరణించారు.

Last Updated : Jun 28, 2020, 8:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.