ETV Bharat / bharat

అగ్ని రహస్యం బయటకు వచ్చింది! - అగ్ని 3

భారత్​కు చెందిన అత్యంత కీలకమైన అగ్ని-2, అగ్ని-3 క్షిపణులు ఉంచే రహస్య స్థావరాల వివరాలు బయటకు పొక్కాయి. ఓ భారత సైనిక అధికారి యథాలాపంగా తన చిరునామాను మార్చడం వల్లనే ఇది జరిగింది. అమెరికాలోని హార్వర్డ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు ఈ విషయాన్ని వెల్లడించారు.

How an Army officer's address change revealed secret location of Agni missile base
అగ్ని రహస్యం బయటకు వచ్చింది!
author img

By

Published : Jun 10, 2020, 6:58 AM IST

అణ్వస్త్రాలను మోసుకెళ్లే సామర్థ్యమున్న కీలక క్షిపణులు కొలువుదీరిన ప్రదేశాలు అత్యంత గోప్యం. వాటి వివరాలు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు పొక్కకూడదు. అయితే భారత సైన్యంలోని ఓ అధికారి యథాలాపంగా తన చిరునామాను మార్చడం వల్ల అగ్ని-2, అగ్ని-3 క్షిపణుల రహస్య స్థావరాన్ని కనుగొన్నామని అమెరికాలోని హార్వర్డ్‌ విశ్వవిద్యాలయ పరిశోధకులు చెప్పారు. హార్వర్డ్‌ కెన్నెడీ స్కూల్‌ పరిశోధకులు ఫ్రాంక్‌ ఒ డోనెల్‌, అలెక్స్‌ బోల్‌ఫ్రాస్‌లు 'ద స్ట్రాటిజిక్‌ పోశ్చర్స్‌ ఆఫ్‌ చైనా అండ్‌ ఇండియా' పేరిట ఒక పరిశోధన పత్రాన్ని తాజాగా వెలువరించారు. భారత్‌లో అగ్ని-2, అగ్ని-3 స్థావరాన్ని గుర్తించడానికి ఉపయోగపడిన విధానాలను వారు ప్రస్తావించారు. ఆవివరాలు వారి మాటల్లోనే..

"ఈశాన్య భారత్‌లో అగ్ని-2ను మోహరించే అంశాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు 2010లో ఆగస్టులో మీడియాలో వార్తలు వచ్చాయి. పశ్చిమ, మధ్య, దక్షిణ చైనాలోని లక్ష్యాలను ఛేదించేందుకు వీలుగా అనువైన ప్రాంతంలో వాటిని మోహరించాలనుకుంటోందని, ఆ మేరకు స్థావరాల నిర్మాణం కోసం భూసేకరణ చేపట్టాలనుకుంటోందన్నది వాటి సారాంశం. దీని ఆధారంగా.. ఆ అస్త్రాలను మోహరించే వీలున్న స్థావరంపై విశ్లేషణలు మొదలుపెట్టాం. అగ్ని-2 క్షిపణులను భారత సైన్యంలోని '3341 మిసైల్‌ గ్రూప్‌' నిర్వహిస్తున్నట్లు బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌ సైనిక డేటా ఆధారంగా గుర్తించాం. అనంతరం.. ఆ విభాగంలో పనిచేస్తున్న ఒక భారత సైనికాధికారి వివరాలను ఇంటర్నెట్‌లో బహిరంగంగా లభ్యమవుతున్న డేటా నుంచి సేకరించాం. ఆ అధికారి 2010-11లో తన చిరునామాను అసోంలోని నగావ్‌కు మార్చినట్లు ఆన్‌లైన్‌ రికార్డుల ఆధారంగా గుర్తించాం. ఇది మా దృష్టిని ఆకర్షించింది. 2017 చివరి వరకూ ఆ అధికారి అక్కడే ఉన్నారు. దీన్నిబట్టి 3341 మిసైల్‌ గ్రూప్‌ నగావ్‌లో మోహరించినట్లు తేల్చాం."

భారత్‌దే పైచేయి..

అణ్వస్త్ర సామర్థ్యంతోపాటు సంప్రదాయ సైనిక సత్తా విషయంలో భారత్‌తో పోలిస్తే చైనాదే పైచేయి అన్న భావన ప్రబలంగా ఉంది. ఇది తప్పని ఫ్రాంక్‌, అలెక్స్‌లు పేర్కొన్నారు. "సంప్రదాయ సైనిక సామర్థ్యం విషయంలో భారత్‌కు కీలక పైచేయి ఉంది. దీన్ని పెద్దగా ఎవరూ గుర్తించడంలేదు. చైనా నుంచి పొంచి ఉన్న దాడుల ముప్పును ఇది తగ్గిస్తోంది" అని వివరించారు.

అగ్ని-3 ఇలా..

"ఇక అగ్ని-3 విషయానికొస్తే రక్షణ శాఖకు సంబంధించిన రెండు వార్తలు మా దృష్టిని ఆకర్షించాయి. ఈ క్షిపణి.. చైనాలోని షాంఘైని తాకే వీలుందని సైనిక ప్రతినిధి ఒకరు చెప్పడం మొదటి వార్త సారాంశం. అందుకోసం ఆ అస్త్రాన్ని ఈశాన్య భారత్‌లోని కొన భాగం నుంచి ప్రయోగించాల్సి ఉంటుందని ఆ ప్రతినిధి చెప్పారు. అగ్ని-3 భారత సైనిక దళాల్లో చేరిందని 2014లో రక్షణ మంత్రిత్వశాఖ ప్రకటించడం రెండో వార్త సారాంశం. ఈ రెండు వార్తలను ఇతర అంశాలతో కలిపి విశ్లేషించాం. ఒకే చోట వివిధ రకాల క్షిపణులను మోహరించే అలవాటు భారత సైన్యానికి ఉంది. ఈ లెక్కన అగ్ని-3ని కూడా నగావ్‌లోనే మోహరించారని గుర్తించాం" అని తెలిపారు. అగ్ని-2కు 2వేల కిలోమీటర్లు, అగ్ని-3కి 3500 కిలోమీటర్ల పరిధి ఉంది.

ఇదీ చూడండి: 'భారత్‌ గొప్ప శక్తిగా ఎదగడం ఖాయం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.