కర్ణాటక, బెంగళూరులో దారుణం జరిగింది. ఎన్నో హత్య కేసుల్లో నిందితుడిగా ఉన్న రౌడీషీటర్ బెస్తమనహల్లి సునీల్‌ను.. అనేకల్‌కు చెందిన మరో రౌడీ గ్యాంగ్ అత్యంత కిరాతకంగా హత్య చేసింది.
మైసూర్ రోడ్, కదంభాలోని ఓ హోటల్ ఎదురుగా.. రాత్రి 7.30 గంటల ప్రాంతంలో హుండాయి వెర్నా ఫ్లూడిక్ కారులో కూర్చున్నాడు సునీల్. అదే సమయంలో దాదాపు ఆరుగురు వేట కొడవళ్లతో కారు అద్దలు పగులగొట్టి దాడికి దిగారు. తప్పించుకునే ప్రయత్నం చేసినా.. సునీల్ కారును కదలనీయకుండా చుట్టుముట్టారు రౌడీలు. విచక్షణారహితంగా కత్తులతో సునీల్‌ను పొడిచి చంపారు. ఈ ఘటన హోటల్ సీసీటీవీలో రికార్డైంది.
సునీల్‌ను కాపాడేందుకు ప్రయత్నించిన కారు డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: మనవళ్లకు ప్రేమతో తాతయ్య 'గొర్రెల బండి'!