"బిహార్‌లో మహాకూటమి విజయం ఖాయం... విపక్షాలు విజయదుందుబి మోగించడం లాంఛనం..." ఇవీ ఎన్నికల సమరం ముగిసిన వెంటనే ఎగ్జిట్‌పోల్స్ అంచనాలు. యువశక్తికే బిహార్ ప్రజలు మొగ్గుచూపారనే అనుకున్నారంతా. కానీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముందుకు సాగుతున్న కొద్దీ.. పరిస్థితులు తారుమారయ్యేలా కనపడుతున్నాయి. అధికార ఎన్డీఏ అనూహ్యంగా పుంజుకుని దూసుకుపోతోంది. ఈ పరిణామాలు ఓ రసవత్తర టీ-20 మ్యాచ్‌ను తలపిస్తున్నాయి.
అయితే రాష్ట్రంలో పరిస్థితులు విచిత్రంగా ఉన్నాయి. సోమవారం వరకు ఉత్సాహంగా కనపడిన మహాకూటమి శ్రేణుల్లో ఒక్కసారిగా అసంతృప్తి నెలకొంది. మరోవైపు మంగళవారం ఉదయం వరకు ఎక్కడా కనపడని జేడీయూ- భాజపా బృందంలో ఆశలు వికసించాయి. నేతలు ఒక్కొక్కరుగా పార్టీ కార్యాలయాలకు చేరుకుని సంబరాలకు సన్నద్ధమవుతున్నారు.
ఆశలు ఆవిరి...
ఆర్జేడీ శిబిరంలో సంతోషం సన్నగిల్లుతోంది. పార్టీ విజయం ఖాయమని భావించి.. మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవీ నివాసానికి చేరుకున్న తేజస్వీ యాదవ్ మద్దతుదారులు.. ఒక్కొక్కరుగా అక్కడి నుంచి జారుకుంటున్నారు. కానీ కొద్ది మంది మాత్రం ఆశతో తేజస్వీ గెలుపు కోసం ప్రార్థిస్తున్నారు.
ఇదీ చూడండి:- షాంఘై సదస్సులో మోదీ- చైనాపై మాటల దాడి!
అటు ఎన్డీఏ ఆధిక్యం సంపాదించడం వల్ల కాంగ్రెస్ ఆశలు కూడా ఆవిరైపోయాయి.
లెక్కింపు ఆలస్యం...
అనుకున్నట్టుగానే ఓట్ల లెక్కింపు ప్రక్రియపై కరోనా ప్రభావం పడింది. అనేక కేంద్రాల వద్ద కౌంటింగ్ ఆలస్యంగా జరుగుతోంది. ఇంకా చాలా ఓట్లు లెక్కించాల్సి ఉన్న నేపథ్యంలో ఫలితాలు తారుమారయ్యే అవకాశమూ లేకపోలేదు.
లడ్డూలొస్తే కష్టమే!
సహజంగా ఓట్ల లెక్కింపు నాడు ఆధిక్యంలో ఉన్న పార్టీ హంగామా అంతా ఇంతా ఉండదు. పార్టీ కార్యాలయాల్లో ఉన్న ప్రతి ఒక్కరి నోరు తీపి రుచి చూడాల్సిందే. బాణసంచా మోత మోగాల్సిందే. అయితే బిహార్ భాజపా కార్యాలయాల్లో మాత్రం ఈసారి పరిస్థితులు కొంత వింతగా ఉన్నాయి.
-
#WATCH Bihar: Celebrations outside JD(U) office in Patna as the latest trends show NDA leading.
— ANI (@ANI) November 10, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
Counting is currently underway for Bihar Assembly elections. pic.twitter.com/HfRiiwfyPh
">#WATCH Bihar: Celebrations outside JD(U) office in Patna as the latest trends show NDA leading.
— ANI (@ANI) November 10, 2020
Counting is currently underway for Bihar Assembly elections. pic.twitter.com/HfRiiwfyPh#WATCH Bihar: Celebrations outside JD(U) office in Patna as the latest trends show NDA leading.
— ANI (@ANI) November 10, 2020
Counting is currently underway for Bihar Assembly elections. pic.twitter.com/HfRiiwfyPh
రాష్ట్రంలో ఎన్డీఏ పుంజుకుంటున్న తరుణంలో భాజపా కార్యాలయాల్లో టపాసుల మోతమోగుతోంది. కానీ లడ్డూల పంపిణీ మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. లడ్డూలు సిద్ధంగా ఉన్నప్పటికీ అవి బయటకు మాత్రం రావడం లేదు.
ఇటీవలే పలు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తొలుత భాజపా దూసుకుపోయింది. గెలుపు ఖాయమనుకుని భాజపా శ్రేణులు లడ్డూలతో చేసిన హంగామా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. కానీ చివరకు ఓటమిపాలైంది. దీంతో ఈసారి పార్టీ నేతలు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. పూర్తి లెక్కలు తేలిన తర్వాతే లడ్డూల పంపిణీ ఉంటుందని తేల్చిచెబుతున్నారు.
అయితే ఎన్డీఏ కూటమిలోని సీనియర్ నేతలు మాత్రం ఎన్నికల ఫలితాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్.. తన అధికార నివాసంలోనే ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితులను తెలుసుకుంటున్నారు. భాజపా-జేడీయూ రాష్ట్ర అధ్యక్షులు తమ కార్యాలయాల్లో ఉండి కౌంటింగ్‌ను చూస్తున్నారు.
ఇదీ చూడండి:- గుజరాత్ ఉపఎన్నికల్లో భాజపా క్లీన్‌స్వీప్