కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా విధించిన నాలుగో విడత లాక్డౌన్ మరో మూడు రోజుల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో లాక్డౌన్ ఇంకా పొడిగించాలా? వద్దా? అనే విషయంపై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఫోన్లో మాట్లాడారు హోంమంత్రి అమిత్ షా. ఈ విషయంపై అభిప్రాయాలను తెలియజేయాలని కోరారు.
అని రాష్ట్రాల ముఖ్యమంత్రుల నుంచి లాక్డౌన్ పొడిగింపు విషయమై హొంమంత్రి సలహాలు, సూచనలు కోరినట్లు అధికారులు తెలిపారు.
కరోనా మహమ్మారి నియంత్రణ చర్యల్లో భాగంగా మార్చి 25న తొలిసారి లాక్డౌన్ ప్రకటించింది కేంద్రం. ఆ తర్వాత నాలుగు సార్లు పొడిగించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న నాలుగో విడత లాక్డౌన్ మే 31తో ముగియనుంది. లాక్డౌన్ 5.0పై మరో రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.