భారత్‌కు మరో తుపాను ముప్పు పొంచి ఉంది. ఇటీవలే అంపన్ తుపాను బంగాల్‌ను అతలాకుతలం చేసింది. తాజాగా 'నిసర్గ' తుపాను గుజరాత్, మహారాష్ట్రలను గడగడలాడించేందుకు సిద్ధమవుతున్నట్టు వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో విపత్తును ఎదుర్కోవడానికి చేపడుతున్న ముందస్తు చర్యలపై సమీక్ష నిర్వహించారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. తుపాను వల్ల ఉత్పన్నమయ్యే సమస్యలను ఎదుర్కోవటానికి.. కేంద్రం అన్ని విధాలుగా సహాయం అందిస్తుందని హామీనిచ్చారు షా.
-
Union Home Minister @AmitShah held review meeting with senior officials of NDMA, NDRF, IMD & Indian Coast Guard on preparedness for dealing with Cyclone brewing in Arabian sea which is expected to hit some parts of Maharashtra & Gujarat. MoS @nityanandraibjp was also present. pic.twitter.com/qxmeKkUUqt
— गृहमंत्री कार्यालय, HMO India (@HMOIndia) June 1, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Union Home Minister @AmitShah held review meeting with senior officials of NDMA, NDRF, IMD & Indian Coast Guard on preparedness for dealing with Cyclone brewing in Arabian sea which is expected to hit some parts of Maharashtra & Gujarat. MoS @nityanandraibjp was also present. pic.twitter.com/qxmeKkUUqt
— गृहमंत्री कार्यालय, HMO India (@HMOIndia) June 1, 2020Union Home Minister @AmitShah held review meeting with senior officials of NDMA, NDRF, IMD & Indian Coast Guard on preparedness for dealing with Cyclone brewing in Arabian sea which is expected to hit some parts of Maharashtra & Gujarat. MoS @nityanandraibjp was also present. pic.twitter.com/qxmeKkUUqt
— गृहमंत्री कार्यालय, HMO India (@HMOIndia) June 1, 2020
వీడియో కాన్ఫరెన్స్‌లో..
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే, గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ, కేంద్రపాలిత ప్రాంతం డామన్ డయ్యూ, దాద్రానగర్ హవేలి పాలకుడు ప్రఫుల్ పటేల్‌లతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు అమిత్ షా. ఈ నేపథ్యంలో తుపానును ఎదుర్కోవడానికి కావాల్సిన వనరులపై వివరించమని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను అడిగారు షా.
31 బృందాలు..
ఇప్పటికే మహారాష్ట్ర, గుజరాత్, డామన్ డయ్యూ, దాద్రానగర్ హవేలిల్లో 31 జాతీయ విపత్తు ప్రతిస్పందన దళాలను(ఎన్డీఎంఏ) మోహరించినట్లు హోంమంత్రిత్వశాఖ తెలిపింది. 13 బృందాలను గుజరాత్లో, 16బృందాలు మహారాష్ట్రలో, మిగిలిన 2 బృందాలను డామన్ డయ్యూ, దాద్రానగర్ హవేలిలో మోహరించినట్లు వివరించింది. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు ఎన్డీఎంఏ సిబ్బంది.
ఆగ్నేయ అరేబియా సముద్రంలో ఇటీవల అల్పపీడనం ఏర్పడినట్టు వాతావరణ శాస్త్రవేత్తలు వివరించారు. ఇది భీకర తుపానుగా మారనున్నట్లు తెలిపారు. 'నిసర్గ'గా పిలుస్తోన్న ఈ తుపాను ఈ నెల 3వ తేదీ సాయంత్రానికి దక్షిణ గుజరాత్, ఉత్తర మహారాష్ట్ర మధ్య తీరాన్ని తాకవచ్చని వారు తెలిపారు.
ఇదీ చూడండి: రెండు రోజుల్లో దేశానికి మరో తుపాను ముప్పు..!