అయోధ్యలో మసీదు నిర్మాణానికి ఇండో-ఇస్లామిక్ సాంస్కృతిక సంస్థ(ఐఐసీఎఫ్) విరాళాల సేకరణ మొదలుపెట్టింది. హిందు-ముస్లిం ఐక్యతకు ఉదహరణగా నిలిచేలా లఖ్నవూ విశ్యవిద్యాలయానికి చెందిన రోహిత్ శ్రీవాస్తవా మసీదు కోసం 21 వేల రూపాయలు విరాళంగా ఇచ్చారు. మసీదు నిర్మాణానికి అందిన తొలి విరాళం ఇదే.
రోహిత్ విరాళంపై ఐఐసీఎఫ్ కార్యదర్శి, ప్రతినిధి అతార్ హుస్సేన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సంఘటన 'గంగా జమునీ తెహజీబ్'కు ప్రతీక అని పేర్కొన్నారు.
![hindu-man-becomes-first-donor-for-mosque-construction-in-ayodhya](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/up-luc-02-hindu-man-donates-money-for-mosque-image-10058_03102020184740_0310f_1601731060_555.jpg)
భారత్ సహా వివిధ దేశాల నుంచి విరాళాలు సేకరించేందుకు ఐఐసీఎఫ్ రెండు బ్యాంకు ఖాతాలను తెరిచింది. అయోధ్యలో కేటాయించిన ఐదెకరాల స్థలంలో మసీదు నిర్మాణం చేపట్టనుంది. మసీదుతో పాటు ఆస్పత్రి, గ్రంథాలయం సహా పలు భవనాలను నిర్మించనుంది.
ఇదీ చదవండి- విమానం కూలి ఇద్దరు నావికాదళ సిబ్బంది మృతి