ETV Bharat / bharat

హిమాచల్: నదుల ఉగ్రతాండవం.. 8 మంది మృతి

హిమాచల్​ ప్రదేశ్​ వ్యాప్తంగా భారీ వర్షాలు కల్లోలం సృష్టిస్తున్నాయి. నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పూర్తిగా పర్వతప్రాంతం కావటం వల్ల చాలా చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. రహదారులు ధ్వంసమై రాకపోకలు స్తంభించాయి. వేర్వేరు ఘటనల్లో 8 మంది మృతి చెందారు.

రహదార్లు ధ్వంసం
author img

By

Published : Aug 18, 2019, 12:47 PM IST

Updated : Sep 27, 2019, 9:32 AM IST

నదుల ఉగ్రతాండవం

హిమాచల్ ప్రదేశ్‌లో వరదల బీభత్సం కొనసాగుతోంది. భారీ వర్షాలకు నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. వానల ధాటికి చాలా ప్రాంతాల్లో కొండచరియలు విరిగి రహదారులపై పడుతున్నాయి. ఫలితంగా రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది.

జాతీయ రహదారి మూసివేత

కుల్లులోని అఖారా బజార్ సమీపంలో బియాస్‌నదిపైనున్న వంతెన కూలింది. కొండచరియలు విరిగిపడి కుల్లు-మనాలీ 3వ నంబరు జాతీయ రహదారి ధ్వంసమైంది. ఈ దారిలో రాకపోకలు నిలిచిపోయి భారీ స్థాయిలో వాహనాలు బారులు తీరాయి. విరిగిపడిన కొండచరియలను తొలగిస్తున్నా మరిన్ని చోట్ల పడుతూనే ఉన్నాయి.

రాష్ట్రవ్యాప్తంగా వర్షాల కారణంగా సంభవించిన వేర్వేరు ప్రమాదాల్లో 8 మంది మృతి చెందారు.

నదీ తీరాల్లో హెచ్చరిక

చంపా జిల్లాలో వరద ఉద్ధృతికి రహదారి తెగిపోయింది. రాకపోకల కోసం తాత్కాలిక ఏర్పాట్లు చేశారు. అనేక నదులు, ముఖ్యంగా రావి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో నదీ పరీవాహక ప్రాంతాల ప్రజలను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. నదీ తీరాలకు వెళ్లొద్దని హెచ్చరించింది.

విద్యుత్​ సేవలకు అంతరాయం

రావి నది మీద జీఎంఆర్​ సంస్థ నిర్మిస్తున్న 180 మెగావాట్​ విద్యుత్​ ప్రాజెక్టుకు సంబంధించిన పలు కంటెయినర్లు కొట్టుకుపోయాయి. భారీ వర్షాలతో రాష్ట్రంలో చాలా చోట్ల విద్యుత్​ సేవలకు అంతరాయం కలుగుతోంది.

సిమ్లాలో భారీ వర్షాలకు ఓ గోడ కూలిపోయిన ఘటనలో ఒక వ్యక్తి మృతి చెందాడు. రాష్ట్ర వ్యాప్తంగా సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.

ఇదీ చూడండి: ఉత్తరాదిపై వరుణుడి ప్రతాపం- జనం విలవిల

AP Video Delivery Log - 0100 GMT News
Sunday, 18 August, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0008: Afghanistan Blast AP Clients Only 4225487
Dozens feared dead in wedding hall blast in Kabul
AP-APTN-0008: Mexico Feminist Vandals AP Clients Only 4225488
Mexico City to scrub graffiti after feminist protests
AP-APTN-0008: Afghanistan Blast Hospital AP Clients Only 4225489
Wedding party blast victims in Kabul hospital
AP-APTN-0008: Switzerland Japan Ivory AP Clients Only 4225486
Japan craft group worried about possible ivory ban
AP-APTN-2358: US OR Portland Rallies 2 AP Clients Only 4225490
Police make arrests at Portland rally; skirmishes
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Sep 27, 2019, 9:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.