మోదీ ప్రసంగంలోని ముఖ్యాంశాలు....
- అధికరణ 370 రద్దు తర్వాత ఒకే దేశం, ఒకే రాజ్యాంగ స్ఫూర్తి కల సాకారమైంది.. ఇది దేశం గర్వించదగ్గ విషయం.
- 'జనాభా విస్ఫోటనం' రాబోయే తరాలకు కొత్త సవాళ్లను సృష్టిస్తుంది. జనాభా పెరుగుదలను అరికట్టే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు ప్రారంభించాలి.
- దేశంలో పర్యటక రంగ పురోగతికి ఎన్నో అవకాశాలున్నాయి. 2022 నాటికి ప్రతి ఒక్కరూ దేశంలోని 15 పర్యటక ప్రదేశాల్లో పర్యటించండి.
- త్రివిధ దళాల మధ్య మరింత సమన్వయం, సమర్థ నాయకత్వం కోసం చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ పేరిట ప్రత్యేక వ్యవస్థ.
- జీఎస్టీ అమలుతో ఒకే దేశం-ఒకే పన్ను కల సాధ్యమైంది. విద్యుత్ రంగంలోనూ ఒకే దేశం-ఒకే గ్రిడ్‌ను నెరవేర్చుకున్నాం.
- 'ఒకే దేశం-ఒకే ఎన్నిక'పై చర్చ జరగాల్సిన అవసరం ఉంది. దేశాన్ని ఉన్నతస్థాయిలో నిలిపేందుకు ఇది అత్యవసరం.
- వచ్చే ఐదేళ్లలో 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్ ఆవిర్భవిస్తుంది.
- సులభతర వాణిజ్య విధానంలో ప్రపంచ దేశాల్లో భారత్‌ను తొలి 50లోపు ర్యాంకులో నిలపడమే లక్ష్యం.
- అభివృద్ధి కోసం ఎక్కువ కాలం ఎదురుచూసే పరిస్థితుల్లేవు. హై జంప్ తప్పనిసరి. ఈ దిశగా చర్యలు ప్రారంభిస్తాం.
- ఆధునిక మౌలిక వసతుల కల్పన కోసం రూ. 100 లక్షల కోట్లు ఖర్చు చేస్తాం.
- ఇంటింటికీ తాగునీరు అందించడమే లక్ష్యంగా రూ. 3.5 లక్షల కోట్లతో 'జల్ జీవన్ మిషన్' పథకం ప్రకటన.
- 'ముమ్మారు తలాక్ రద్దు'తో ముస్లిం మహిళల మెరుగైన జీవనానికి తోడ్పాటు అందించాం. ఈ చారిత్రక నిర్ణయాన్ని రాజకీయ కోణంలో చూడరాదు.
- ఉగ్రవాదాన్ని పెంచి పోషించే వారికి వ్యతిరేకంగా భారత్ నిరంతరం పోరాడుతుంది.
- ఉగ్రవాదంపై పోరుకు అన్ని దేశాలు కలిసి రావాలి.
- 2014-19 దేశ ప్రజల అవసరాలను తీర్చిన యుగం అయితే.. 2019 నుంచి వారి ఆకాంక్షలు, కలలు సాకారం చేసే దిశగా పయనిద్దాం.
- అవినీతి, నల్లధనం నిర్మూలనలో ప్రతి ఒక్క ప్రయత్నం స్వాగతించదగ్గదే. భారతదేశాన్ని 70 ఏళ్లుగా నాశనం చేసిన ప్రమాదకర జబ్బు... అవినీతి.
- ప్రజల జీవనంలో ప్రభుత్వం పాత్ర పరిమితంగా ఉండాలి.
- ప్రజలు తమ ఆకాంక్షలను నెరవేర్చుకునే విధంగా వారికి స్వేచ్ఛనివ్వండి. ఇందులో భాగంగా సరైన పర్యావరణ వ్యవస్థ రూపొందించనివ్వండి.
- భారత్ త్వరలో బహిరంగ మల, మూత్ర విసర్జన రహిత దేశంగా అవతరిస్తుంది.
ఇదీ చూడండి: