బంగాల్ సీఎం మమతా బెనర్జీ నియంతలా వ్యవహరిస్తున్నారని కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ ఆరోపించారు. రాష్ట్రంలో ఇతర పార్టీల ర్యాలీలకు అనుమతించరని విమర్శించారు. భాజపా, తృణమూల్ కార్యకర్తల మధ్య తలెత్తిన ఘర్షణలో నలుగురు మృత్యువాత పడటంపై స్పందించారు కేంద్రమంత్రి.
"రాజ్యాంగం ద్వారా చేసే శాసనంపై మమతా బెనర్జీకి నమ్మకం లేదు. ప్రధాన మంత్రినీ లెక్కచేయరు. వ్యవస్థలో ఇమడలేరు. వారి పతనం ప్రారంభమయింది. బంగాల్లో ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారు. కిమ్జోంగ్లాగా మమత వ్యవహరిస్తున్నారు. ఎవరైనా వ్యతిరేకిస్తే వారిని చంపేస్తామని బెదిరిస్తున్నారు. రాష్ట్రంలో ఇతర పార్టీల ర్యాలీలనూ అనుమతించరు. ప్రజలు వారికి వ్యతిరేకంగా ఉద్యమిస్తారు. మట్టిలో కలిపేస్తారు."
-గిరిరాజ్ సింగ్, కేంద్రమంత్రి
ఇదీ చూడండి': ఫిరాయింపులపై ఉన్న శ్రద్ధ.. సంక్షేమంపై లేదు