భాజపా ఎంపీ, బాలీవుడ్ కలల సుందరి హేమ మాలిని... మరోసారి కాలికి గజ్జెకట్టారు. సినిమాల్లోకి పునరాగమనం చేస్తున్నారా అని అనుమానం వద్దండోయ్. ఓ ఆలయంలో నిర్వహించిన భక్తి కార్యక్రమంలో ఆడిపాడి ఆహూతుల్ని అలరించారు హేమ.
ఉత్తర్ప్రదేశ్ వృందావన్లోని రాధారమణ్ మందిరంలో జరుగుతున్న ఝూలా ఉత్సవంలో భక్తి పాటలకు అనుగుణంగా నృత్యం చేశారు హేమ మాలిని. ఎరుపు రంగు లెహంగా, బంగారు ఆభరణాలు ధరించి భాజపా ఎంపీ చేసిన అభినయం ఆహూతులను ఆకట్టుకుంది.
"వృందావన్లోని రాధారమణ్ ఆలయంలో నృత్యం చేయడం గౌరవంగా భావిస్తున్నా"
-హేమ మాలిని, భాజపా ఎంపీ
ఝూలా ఉత్సవం...
హరియాలీ తీజ్గా పిలిచే ఈ ఉత్సవాన్ని శ్రావణమాసం మూడో రోజు నుంచి 15వ రోజు వరకు నిర్వహిస్తుంటారు. పార్వతీ పరమేశ్వరులు మళ్లీ కలుసుకునే సందర్భంగా జరిగే ఈ వేడుక మహిళలకు మాత్రమే ప్రత్యేకం.
ఇదీ చూడండి: ఐఏఎస్ మద్యం మత్తుకు పాత్రికేయుడు బలి!